ETV Bharat / politics

ప్రజాకాంక్షలు నెరవేరేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోంది : గవర్నర్ తమిళిసై - Telangana Assembly Budget Sessions

Telangana Assembly Sessions Governor Speech 2024 : రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజైన నేడు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగించారు. కాళోజీ మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళిసై ప్రస్తుతం రాష్ట్రంలో కొలువైన సర్కార్ ప్రజాకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తుందని అన్నారు.

Telangana Assembly Sessions  2024
Telangana Assembly Sessions
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2024, 11:43 AM IST

Updated : Feb 8, 2024, 12:46 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకాంక్షలు నెరవేరేలా పాలన సాగిస్తోంది : గవర్నర్ తమిళిసై

Telangana Assembly Sessions Governor Speech 2024 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కాళోజీ మాటలతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజాభవన్‌లో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజలకు అనుమతి లభించిందని గవర్నర్ అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రజా సర్కార్ కొలువుదీరింది : రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను సకాలంలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 2 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసిందని, త్వరలోనే మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందని చెప్పారు. యువకుల బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణలో ప్రజాకాంక్షలు నెరవేరేలా ఈ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆకాంక్షించారు.

మూసీ సుందరీకరణపై కాంగ్రెస్ ఫోకస్ - నదీ కారిడార్‌ వెంట రోడ్‌ కమ్‌ మెట్రో రైలు మార్గం!

"తెలంగాణ ఏర్పాటులో కలసివచ్చిన పార్టీలు, వ్యక్తులకు ఈ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోంది. దావోస్‌ సమావేశంలో రూ.40 వేల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. తెలంగాణ ఇచ్చిన అప్పటి మన్మోహన్ సర్కారుకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోంది. ప్రత్యేకించి రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ పోషించిన చారిత్రక పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటోంది. ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటికి 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారు. ప్రజాపాలనలో 1.2 కోట్ల దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించారు." - తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్

Governor Speech in TS Assembly Sessions 2024 : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, వికలాంగ పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటు అందిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. ప్రతి రంగానికి ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, అనుకూల వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 10 నుంచి 12 ఫార్మా విలేజ్‌ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తోందన్న గవర్నర్, జనావాసానికి దూరంగా వెయ్యి నుంచి 3 వేల ఎకరాల విస్తీర్ణంతో ఫార్మా విలేజ్‌ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సమగ్ర డిజిటల్‌ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు.

"హైదరాబాద్‌ను దేశంలోనే కృత్రిమ మేథస్సు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తాం. రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తాం. హరిత ఇంధనాలను ప్రోత్సహించేందుకు త్వరలో సమగ్ర ఇంధన పాలసీ రూపొందిస్తాం. రిజర్వాయర్లను పర్యావరణ అనుకూల పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం." - తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్

"పెద్దఎత్తున మూసీ రివర్‌ ఫ్రంట్‌(Musi River Beautification Hyderabad) అభివృద్ధి పనులు చేపడతాం. మూసీ మరోసారి హైదరాబాద్‌ జీవనాడిగా మారుతుంది. హైదరాబాద్‌ తూర్పు-పశ్చిమ భాగాలను అనుసంధానించేలా రవాణా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తాం. క్రీడారంగంలో రాష్ట్రాన్ని అగ్రగ్రామి చేయడమే ప్రభుత్వ లక్ష్యం. కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది." అని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

రేషన్‌కార్డు ఉంటేనే ఉచిత కరెంటు? - రేపో, మాపో తేలనున్న అర్హత నిబంధనలు!

గతంలో నిర్వహించిన గ్రూప్​-1 రద్దు - అదనంగా మరో 60 ఖాళీలతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ : సీఎం రేవంత్​రెడ్డి

Last Updated : Feb 8, 2024, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.