RS Praveen Kumar Resigned from BSP state president Post : బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్తదారి ఎంచుకోవాల్సిన సమయం వచ్చిందని, పార్టీని వీడటం తప్ప మరో అవకాశం లేకుండాపోయిందని పేర్కొన్నారు. రాజీనామా(Resignation) తప్ప తనకు మరో మార్గం కనిపించ లేదని చెప్పుకొచ్చారు. బరువైన గుండెతో బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవలి నిర్ణయాలు పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు.
"పొత్తు (BRS-BSP Alliance) ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. మా పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే బీజేపీ దాన్ని భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో సహా) చేస్తోంది. ఈ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ప్రస్థానాన్ని ఆపలేను. చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా" అని ప్రవీణ్ కుమార్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక బీఎస్పీదే అన్నారు.
'సార్వత్రిక సమరంలో ఒంటరి పోరు- ఎన్నికల తర్వాత పొత్తు'- రిటైర్మెంట్పై మాయావతి క్లారిటీ
భవిష్యత్‌లో కేసీఆర్, బీఆర్ఎస్తో కలిసి నడుస్తా : బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు లేకుండా బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చిందని, ఒప్పందాన్ని ఉల్లంఘించరాదన్నదే నా అభిమతమని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు తాము లౌకిక కూటమి ఏర్పాటు చేస్తే ఒత్తిడి తీసుకొచ్చారని, గులాబీ పార్టీతో పొత్తు లేదని మీడియా సమావేశం పెట్టాలని తనను ఆదేశించారని ఆయన పేర్కొన్నారు.
అందుకే బాధాతప్త హృదయంతో బీఎస్పీని వీడినట్లు తెలిపారు. తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసమే తన నిర్ణయమని చెప్పారు. తాను ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గబోనన్న ప్రవీణ్ కుమార్, అందరితో చర్చించాక రాజకీయ భవిష్యత్‌పై(Political Future) నిర్ణయం తీసుకుంటానని అన్నారు. భవిష్యత్‌లో కేసీఆర్, బీఆర్ఎస్తో కలిసి నడుస్తానని చెప్పారు.
RS Praveen Kumar met with KCR : బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం ప్రకటించే అవకాశముంది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్, బీఎస్పీలు సీట్లపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. పొత్తులో భాగంగా బీఎస్పీకి హైదరాబాద్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ సీట్లను సైతం కేసీఆర్ కేటాయించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాజకీయాల్లో ట్విస్ట్ - లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు