ETV Bharat / politics

'ఆ పోస్టులకు తట్టుకోలేకే తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది'- పవన్ కల్యాణ్​ క్లారిటీ ! - CHANDRABABU AND PAWAN ON FAKE NEWS

సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, రాజకీయ అంశాలపై ఏపీ కేబినెట్​ సమావేశంలో చర్చ - అసభ్య, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నా పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారని పవన్ కల్యాణ్ ఆరోపణ

PAWAN KALYAN ON POLICE NEGLIGENCE
AP CM Chandrababu about Fake News in Social Media (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 5:09 PM IST

AP CM Cabinet discuss on Fake News in Social Media : ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్​ మీడియాలో వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారంపై క్యాబినెట్ సమావేశం ముగిశాక సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఉన్న పోస్టులపై ఉదాసీనత తగదంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్చ లేవనెత్తారు. అసభ్య, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదు వస్తున్నా కొందరు పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులే ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపైనా కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో రాజకీయ అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. కొందరు అధికారుల తీరు వల్లే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఏపీ మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పలు జిల్లాలలోని ఎస్పీలు సైతం మంత్రులు ఫోన్లకు సరిగ్గా స్పందించడంలేదని తెలిపారు. కింద స్థాయిలో డీఎస్పీ, సీఐలపై నెపం నెట్టి తప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మహిళల్ని కించపరిచేలా పెడుతున్న పోస్టులకు తాను తట్టుకోలేకనే తీవ్రంగా స్పందించాల్సిన అవసరం వచ్చిందని పవన్​ కల్యాణ్​ అన్నట్లు సమాచారం.

నెలరోజుల్లోనే వ్యవస్థను గాడికి తెద్దాం : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే కొందరు అధికారులు ఇలా తయారయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నెలరోజుల్లోనే వ్యవస్థను గాడికి తెద్దామని స్పష్టం చేశారు. ఇకపై సోషల్​ మీడియాలో అసత్య పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటికే వివిధ శాఖల్లో పలువురు అవినీతిపరులు అధికారులుగా చలామణి అవుతున్నారని పవన్​ కల్యాణ్​ ఆరోపించినట్లు తెలిసింది.

అవసరమైతే హోంమంత్రి పదవి కూడా తీసుకుంటా : పవన్‌కల్యాణ్‌

'అయ్యా పవన్​ కల్యాణ్​ సార్ - మీరే మాకు న్యాయం చేయాలి - మీ ఒక్కరి వల్లే అవుతుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.