ETV Bharat / politics

లోక్‌సభ ఎన్నికలకు పదునెక్కిన ప్రచారం - ప్రసంగాలతో జోరందుకున్న విపక్ష పార్టీలు - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Opposition Parties Speed Up Election Campaign : లోక్‌సభ ఎన్నికలకు ప్రధాన పార్టీల నాయకులు, ప్రచార పదును పెంచారు. జనంలో ఉంటూ విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిస్తున్నారు. గల్లీ సమస్యలు తీరాలంటే దిల్లీకి తమనే పంపాలని అభ్యర్థిస్తున్నారు. గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామంటూ కాంగ్రెస్‌ ప్రస్తావిస్తుండగా హస్తం పార్టీ, బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ బీఆర్​ఎస్​ నేతలు విమర్శిస్తున్నారు. ప్రధానిగా మోదీ ఉంటేనే జాతీయ సమైక్యత వెల్లివిరుస్తుందని బీజేపీ ప్రచారం చేస్తోంది.

KTR Comments on CM Revanth Reddy
Opposition Parties Speed Up Election Campaign
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 12, 2024, 7:32 PM IST

లోక్‌సభ ఎన్నికలకు పదునెక్కిన ప్రచారం - ప్రసంగాలతో జోరందుకున్న విపక్ష పార్టీలు

Opposition Parties Speed Up Election Campaign : లోక్‌సభ ఎన్నికల్లో అధిక ఎంపీ స్థానాల్లో పాగావేసే లక్ష్యంతో, ప్రధాన పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సమాయత్తమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌(Congress) సర్కార్‌ కొలువుదీరాక రైతులు కరెంట్‌ జనరేటర్ల కోసం బారులు తీరుతున్నారని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పార్టీ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో బీఆర్​ఎస్​ సత్తాచాటుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

KTR Comments on CM Revanth Reddy : ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసి కాంగ్రెస్ ఓటు అడగాలని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​(KTR) డిమాండ్‌ చేశారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక భేటీలో పాల్గొన్న ఆయన, అమలుకు సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో అధిక మెజార్టీతో బీఆర్​ఎస్​ను గెలిపించాలని కోరారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెంలో బీఆర్​ఎస్ ​ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత, ఎమ్మెల్సీ తాత మధు హాజరయ్యారు.

కరెంట్ కష్టాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌ది : నాలుగు నెలల్లోనే ప్రజా వ్యతిరేకతకు కాంగ్రెస్‌ సర్కార్‌ గురైందని సత్యవతి రాథోడ్ విమర్శించారు. కరవు, కరెంట్ కష్టాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కొప్పుల ఈశ్వర్‌ ప్రచారం నిర్వహించారు. ఉదయం నడకకు వచ్చిన వారితో ముచ్చటించిన కొప్పుల, ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. పెద్దపల్లిలో పుట్టి పెరిగిన తనకు స్థానిక సమస్యలపై అవగాహన ఉందన్న ఆయన, ఎంపీగా దిల్లీకి పంపాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ మాటలు నీటిమూటలేనని తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసగిస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఆరోపించారు. కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి​లో ఆందోళన : మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావు రామాయంపేట మున్సిపాలిటీలో రోడ్‌షో నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి జరగాలంటే మోదీ సర్కార్ అధికారంలోకి రావాలని సూచించారు. రాష్ట్రంలో 12కు తగ్గకుండా ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్‌లో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth)లో ఆందోళన, అభద్రతా భావం పెరుగుతోందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు.

'రేవంత్​ రెడ్డి సంగతి నా కన్నా మీకే బాగా తెలుసు. మైక్​ వీరుడు ఆయన. మైక్​ పట్టుకుంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారు.'- కేటీఆర్​, బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల హీట్ - ప్రచార వేగం పెంచిన పార్టీలు - LOK sabha Polls 2024

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - హాట్ ​హాట్​గా అగ్రనేతల ప్రసంగాలు - Lok sabha elections 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.