Mohan Babu Political Warning Tweet : తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని, అలాంటి చర్యలను అస్సలు ఉపేక్షించనని ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్(Twitter) వేదికగా బహిరంగ లేఖ విడుదల చేసిన మోహన్ బాబు, తన పేరును అనవసరంగా వాడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఏ పార్టీ వారైనా తన పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
Mohan Babu Open Letter to Politics : అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నామని, ఎవరి అభిప్రాయం వారిదని లేఖలో మోహన్ బాబు పేర్కొన్నారు. చేతనైతే నలుగురికి సాయపడటంలో దృష్టి పెట్టాలని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీల్లోకి(Political Party), వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధ కలిగిస్తుందన్నారు. అయితే మోహన్ బాబు ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి ఈ లేఖ రాశారనేది స్పష్టంగా చెప్పకపోవడంతో సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం ఈ లేఖపై తీవ్ర చర్చ జరుగుతోంది.
Mohan Babu Latest News : మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు చిందులు..
రూ.100 కోట్ల బడ్జెట్ సినిమా ప్రకటించిన మోహన్ బాబు.. వర్కౌట్ అవుతుందా?