MLC Kavitha On BC Welfare Budget 2024-25 : అసెంబ్లీలో త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వెనుకబడిన వర్గాల (బీసీ) సంక్షేమం కోసం 2024-25 బడ్జెట్‌లో 20 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు(Minister Bhatti) లేఖ రాశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని లేఖలో ఆమె గుర్తు చేశారు.
Telangana BC Welfare Budget 2024-25 : "బీసీ సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు(MLC Kavitha). ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ప్రతి జిల్లా కేంద్రంలో 50 కోట్ల వ్యయంతో ఆచార్య జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామని వాగ్దానం చేసింది." అని కవిత లేఖలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బీసీల సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో 20 వేల కోట్లు కేటాయించాలని ఎమ్మెల్సీ కవిత భట్టి విక్రమార్కను కోరారు. బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు అవుతుందని తెలిపారు. బీసీలు మరింత అభివృద్ధి చెందడానికి ఈ పద్దు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేయాలని, ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని లేఖలో కవిత విజ్ఞప్తి చేశారు.
నిజామాబాద్ లోక్‌సభ బరి నుంచి ఎమ్మెల్సీ కవిత ఔట్ - మరి ఎక్కడి నుంచి పోటీ అంటే?
MLC Kavitha Latest News : మరోవైపు మహాత్మా జ్యోతిరావు పూలేే విగ్రహం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. శాసనసభ ప్రాంగంణలో విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఇటీవలే ఆమె వినతిపత్రం అందించారు. పూలే జయంతి అయిన ఏప్రిల్ 11వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావాలని ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఫూలేకు భారత రత్న ఇవ్వాలని, కేంద్రంలో ఓబీసీల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కవిత అన్నారు. త్వరితగతిన బీసీ జనగణన చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని, ఆర్నెళ్లలో స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని స్పష్టం చేశారు. వీటిని అమలుచేయకపోతే హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టు విచారణ - ఈ నెల 16కు వాయిదా
ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభానికి ప్రియాంక గాంధీని ఓ హోదాలో పిలుస్తారు? : ఎమ్మెల్సీ కవిత