ETV Bharat / politics

లిక్కర్ స్కామ్​తో నాకు సంబంధం లేదు - నాకెలాంటి ఆర్థిక లబ్ధి చేకూరలేదు : కవిత - MLC Kavita Letter to Judge - MLC KAVITA LETTER TO JUDGE

MLC Kavita Letter to CBI Court Judge in the Delhi Liquor Case : ఫోన్లు ధ్వంసం చేశానని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కోర్టు జడ్జికి లేఖ రాశారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా లో విచారణ ఎక్కువగా జరిగిందని అన్నారు. తన బెయిల్​ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్లీ సీబీఐ కోర్టును కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు.

MLC Kavita Wrote a Letter to Judge in the Delhi Liquor Case

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 2:06 PM IST

ఫోన్లు ధ్వంసం చేశానని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు : కవిత

MLC Kavita Letter to CBI Court Judge in the Delhi Liquor Case : దిల్లీ మద్యం కేసులో అరెస్టు అయి జ్యుడిషియల్​ కస్టడీలో ఉన్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కోర్టుకు లేఖ రాశారు. దిల్లీ మద్యం కేసు(Delhi Liquor Case)తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు చెప్పినట్లు తనకు ఆర్థికంగా లబ్ధి చేకూరలేదని తెలిపారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ ఎక్కువగా జరిగిందన్న కవిత, రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపించారు.

"నా ఫోన్​ నంబర్​ను ఛానళ్లలో ప్రసారం చేసి నా గోప్యతను దెబ్బ తీశారు. దిల్లీ మద్యం కేసులో 4 సార్లు విచారణకు హాజరయ్యాను. బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి విచారణకు అన్ని విధాలా సహకరించాను. నా మొబైల్​ ఫోన్లు అన్నీ దర్యాప్తు సంస్థకు అందజేశాను. ఫోన్లు ధ్వంసం చేశానని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రెండున్నర ఏళ్లుగా సోదాలు జరిపారు, వేధింపులకు గురి చేశారు." - కవిత , ఎమ్మెల్సీ

MLC Kavitha Judicial Custody Extended : సాక్షులను బెదిరిస్తున్నట్లు తనపై ఆరోపణలు చేస్తున్నారని లేఖలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ప్రస్తావించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. 95 శాతం కేసులన్నీ ప్రతిపక్ష నేతలకు సంబంధించినవే అని స్పష్టం చేశారు. బీజేపీలో చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుందని విమర్శించారు. విపక్ష పార్టీలన్నీ న్యాయవ్యవస్థ వైపు ఆశతో చూస్తున్నాయని పేర్కొన్నారు.

దిల్లీ మద్యం కేసు దర్యాప్తునకు సహకరించేందుకు తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్సీ కవిత లేఖ(Kavitha Letter)లో స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో బెయిల్​ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నానని అన్నారు. తన చిన్న కుమారుడి పరీక్షలకు తల్లిగా తాను తోడుగా ఉండాలని, తాను లేకుంటే తన కుమారుడిపై ప్రతి కూల ప్రభావం పడవచ్చునని కోర్టుకు విన్నవించారు. తన బెయిల్​ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్లీ సీబీఐ కోర్టును కోరుతున్నానని ఆమె లేఖలో కోరారు.

దిల్లీ లిక్కర్ కేసులో తెరపైకి మరోపేరు - కవిత అల్లుడి పాత్రపై ఈడీ ఆరా

మరో 14 రోజులు జ్యుడిషియల్​ కస్టడీ : బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత 14 రోజుల జ్యుడిషియల్​ కస్టడీ(Kavita 14 Days Judicial Custody) ముగియడంతో అధికారులు ఇవాళ ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 23 వరకు మరో 14 రోజులు జ్యుడిషియల్​ కస్టడీ పొడిగిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. కవిత బెయిల్​పై బయటకు వెళితే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ వాదనలు వినిపించి, మరో 14 రోజులు జ్యుడిషియల్​ కస్టడీకి ఇవ్వాలని కోరింది. మరోవైపు కవిత తరఫు వాదనలు వినిపించిన న్యాయవాది కేసు పొడిగింపు కోరేందుకు ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేదని తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు మరో 14 రోజుల జ్యుడిషియల్​ కస్టడీని పొడిగించారు.

ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట - మధ్యంతర బెయిల్‌ నిరాకరించిన కోర్టు

తిహాడ్ జైలుకు ఎమ్మెల్సీ కవిత - ఇంటి నుంచే భోజనం, మంచం, పరుపులకు వెసులుబాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.