ETV Bharat / politics

'ప్రజలు ఇచ్చిన 2 అవకాశాలను బీఆర్​ఎస్​ సద్వినియోగం చేసుకోలేదు - లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం' - UTTAM KUMAR MEET THE PRESS - UTTAM KUMAR MEET THE PRESS

Minister Uttam Kumar Fires on BJP : లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకమని, ప్రజలు ఇచ్చిన రెండు అవకాశాలను ఆ పార్టీ సద్వినియోగం చేసుకోలేదని మంత్రి ఉత్తమ్ ​కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, వాక్‌ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందన్న ఆయన, ఆర్థిక విధానాల్లోనూ మోదీ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఈ మేరకు మీట్ ది ప్రెస్ ప్రోగ్రాంలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్, బీజేపీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

Minister Uttam Kumar Comments on BRS, BJP
Minister Uttam Kumar Fires on BJP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 5:06 PM IST

Minister Uttam Kumar Comments on BRS, BJP : గత పదేళ్లలో ఎంపీలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదని, పార్లమెంటులో విపక్ష ఎంపీలు మాట్లాడితే వెంటనే సస్పెండ్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి ఆరోపించారు. ఆధారాలు, ఛార్జిషీట్‌, విచారణ లేకుండానే విపక్ష నేతలను జైల్లో పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికే పరిస్థితి ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఈ మేరకు మీట్ ది ప్రెస్ ప్రోగ్రాంలో పాల్గొని ప్రసంగించిన ఆయన, కేంద్ర సర్కార్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలనే కాకుండా మీడియా సంస్థలను కూడా బెదిరించారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే వెంటనే ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు పంపించి బెదిరిస్తారని చెప్పుకొచ్చారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ పరిస్థితి ఎలా ఉందో వివరించారన్నారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, వాక్‌ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందన్నారు.

ఆర్థిక విధానాల్లోనూ మోదీ సర్కార్‌ పూర్తిగా విఫలం : ఆర్థిక విధానాల్లోనూ మోదీ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం 40 శాతానికి ఎగబాకిందన్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి, ఇవ్వకుండా రైతులను తీవ్రంగా నష్టపరిచారన్నారు. కేంద్రంలో రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా నల్ల సాగుచట్టాలు తెచ్చారని దుయ్యబట్టారు.

"బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య విషయంలో ఖూనీ జరుగుతుంది. మరోసారి మోదీ ప్రధాని అయితే పాకిస్థాన్, రష్యా, నార్త్ కొరియాలా దేశం తయారవుతుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపైనే ఈడీ, సీబీఐ దాడులు జరిపి, భయపెడుతుంటే ఇక సామాన్యుల సంగతేంటో మీరే ఆలోచన చేయండి." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి

లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకం : మంత్రి ఉత్తమ్​కుమార్ (ETV Bharat)

కొన్ని నెలల పాటు రైతులు తీవ్రమైన ఆందోళన చేశాక, సాగు చట్టాలను బీజేపీ రద్దు చేసిందని ఉత్తమ్ గుర్తు చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, భర్తీ చేయలేదని విమర్శించారు. అగ్నివీర్‌ పథకం దేశ రక్షణకు ప్రమాదకరమన్న మంత్రి ఉత్తమ్‌, దేశంలో కాషాయ పార్టీ పాలన మొదలయ్యాకే చైనా వంటి దేశాలు కొంతమేర ఇండియా భూభాగాన్ని ఆక్రమించాయని ఆరోపించారు. గతంలో ఏ ప్రధాని కూడా మోదీ అంతలా దిగజారి మాట్లాడలేదని దుయ్యబట్టారు.

Minister Uttam Comments on BRS Party : పదేళ్లలో మోదీ సర్కార్ ఏం చేసిందో చెప్పటం లేదన్న ఉత్తమ్, మళ్లీ గెలిస్తే ఏం చేస్తారో కూడా వివరించటం లేదని ఆక్షేపించారు. కమలం పార్టీ నేతలకు తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత కూడా లేదని పునరుద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకమన్న మంత్రి, ప్రజలు ఇచ్చిన రెండు అవకాశాలను గులాబీ పార్టీ సద్వినియోగం చేసుకోలేదన్నారు. కాళేశ్వరం విషయంలో జరిగిన తప్పులకు కేసీఆర్ జనాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసారి అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికతో కారు కనుమరుగవ్వడం గ్యారంటీ : మంత్రి ఉత్తమ్​ - Congress Leaders Reaction on KCR

ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశ దశ - దిశను మార్చబోతున్నాయి : మంత్రి ఉత్తమ్‌ - lok sabha elections 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.