ETV Bharat / politics

పనిష్మెంట్‌పై బదిలీ చేసే అధికారులను ఏజెన్సీలకు పంపడమేంటి? : సీతక్క - MP Soyam Bapurao on BRS Govt

Minister Seethakka Comments on Govt Officials : రాష్ట్రంలో అధికారుల పనితీరుపై మంత్రి సీతక్క కీలకవ్యాఖ్యలు చేశారు. పనిష్మెంట్‌పై బదిలీచేసే అధికారులను, పని ఒత్తిడి ఉన్నచోట, ప్రశ్నించే చోట వేయాలే తప్పా అమాయకులైన ఆదివాసీ ప్రజలు నివసించే ఏజెన్సీ ప్రాంతాల్లో వేయకూడదని వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఇంద్రవెల్లిలో నిర్వహించిన నాగోబా జాతర దర్బార్​లో ముఖ్య అతిథిలుగా సీతక్క, ఆదిలాబాద్​ ఎంపీ సోయంబాపురావు పాల్గొన్నారు.

Nagoba Darbar 2024
Minister Seethakka Comments on Govt Officials
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 12, 2024, 9:21 PM IST

Updated : Feb 12, 2024, 10:28 PM IST

పనిష్మెంట్‌పై బదిలీ చేసే అధికారులను ఏజెన్సీలకు పంపడమేంటి? : సీతక్క

Minister Seethakka Comments on Govt Officials : రాష్ట్రంలో అధికారుల బదిలీల విషయంలో, ఉన్నతాధికారుల పనితీరుపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జిల్లాలో ఏర్పాటు చేసిన నాగోబా దర్బార్​కు ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎస్పీ ఆలం గౌస్‌, ఐటీడీఏ పీవో కుష్భూ, జిల్లా అటవీ అధికారి(District Forest Officer) పాటిల్‌ ఆధ్వర్యంలో పాల్గొన్నారు.

Nagoba Darbar 2024 : ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సీతక్క, అధికారుల పనితీరును ప్రస్తావిస్తూ, చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతాంశంగా మారాయి. ఆదిలాబాద్‌ జిల్లాకు ఇన్‌ఛార్జి(District Incharge) మంత్రిగా పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో మినహాయిస్తే మళ్లీ రాజకీయాలు మాట్లాడనని స్పష్టం చేసిన ఆమె, తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని పునరుద్ఘాటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులు సైతం మానవత్వంతో పనిచేయాలని హితవు పలికారు. ఆదివాసీల ప్రాబల్యం కలిగిన ఉమ్మడి కుమురం భీం జిల్లాలో మానవత్వంతో పనిచేస్తేనే ప్రజలు గుర్తించుకుంటారని పేర్కొన్నారు.

నాగోబా జాతరకు వేళాయే - ఇవాళ అర్ధరాత్రి మహా పూజతో ప్రారంభం కానున్న ఆదివాసీల పండుగ

"ఈ జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దామని ప్రజాప్రతినిధులందరికీ పిలుపునిస్తున్నాను. ముఖ్యంగా అధికారులు వారి విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. పనిష్మెంట్​ ఉన్న అధికారులను అడవుల్లో వేస్తున్నారని, కానీ మానవత్వం ఉన్న అధికారులు ఈ ప్రాంతానికి అవసరమన్నారు. శిక్ష కోసం ఈ ప్రాంతాలకు అధికారులను వేస్తే, వాళ్లు వచ్చి మన జనాలను శిక్షిస్తారు. పని ఒత్తిడి ఉండే ప్రదేశంలో వేయాల్సినవారిని ఇక్కడ వేయడమేంటి."-సీతక్క, రాష్ట్రమంత్రి

Adilabad MP Soyam Bapurao on BRS Govt : ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో(BRS Govt) ఆదివాసీలు అటవీప్రాంతానికి తునికాకు వెళ్లినా, పెళ్లిపందిరి కలప కోసం వెళ్లినా అనవసర కేసులు నమోదు చేసి, ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. అంతేకాకుండా పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేసిందని గుర్తుచేశారు. అలాంటి దురాఘాతాలకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ పాల్పడకూడదని హితవు పలికారు.

ఏజెన్సీ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. అనర్హులను ఎస్టీ జాబితా నుంచి తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని పరోక్షంగా లంబాడీ ప్రజలను(Lambadi People) ఉద్దేశించి ఎంపీ పేర్కొన్నారు. అంతకు ముందు సీతక్క ఎంపీ సోయం బాపురావు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుతో కలిసి మెస్రం వంశీయుల ఇలవేల్పు నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు మెస్రం వంశీయులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికి, దేవతావిగ్రహాలను బహుకరించారు.

భాజపావాదం... ఆదివాసీ నినాదం: ఎంపీ సోయం బాపురావు

అట్టహాసంగా ప్రారంభమైన నాగోబా జాతర - ఐదు రోజుల పాటు కొనసాగనున్న మహాక్రతువు

Last Updated : Feb 12, 2024, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.