ETV Bharat / politics

అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం కట్టారు : మంత్రి కోమటిరెడ్డి - Komati Reddy Comment On Kaleshwaram

Minister Komati Reddy Sensational Comments On Kaleshwaram : సూర్యాపేటలో ప్రజలు మూసీ నీరు తాగుతుంటే, అవసరం లేకున్నా గత ప్రభుత్వం ఉత్తర తెలంగాణ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన మంత్రి, మాజీ సీఎం కేసీఆర్​పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లాను పూర్తిగా నాశనం చేసి, ఇప్పుడు ఏ ముఖంపెట్టుకొని మళ్లీ నల్లగొండ వస్తారంటూ విరుచుకుపడ్డారు.

Minister Komati Reddy Press meet
Minister Komati Reddy Comments On Kaleshwaram
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 4:52 PM IST

Updated : Feb 5, 2024, 7:30 PM IST

అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం కట్టారు : మంత్రి కోమటిరెడ్డి

Minister Komati Reddy Comments On Kaleshwaram : సూర్యాపేటలో తాగేందుకు నీళ్లు లేక ఇక్కడి ప్రజలు మూసీ నీళ్లు తాగుతుంటే, అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం కంటే ముందే ప్రారంభించిన డిండి ప్రాజెక్టు(Dindi Project) ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కమీషన్ల కోసం కట్టిన కాళేశ్వరం, మూడేళ్లకే కుంగిపోయిందని విమర్శించారు. ఏపీ సీఎం జగన్​తో కుమ్మక్కై దక్షిణ తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారన్నారు.

Minister Komati Reddy Fires on Jagadish Reddy : జిల్లాలో బీఆర్ఎస్ రూ.300 కోట్లు ఖర్చుపెట్టి ఒక్క సీటు మాత్రమే గెలిచిందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తాము సూర్యాపేటలో ప్రచారం చేసి ఉంటే జగదీశ్‌ రెడ్డి(Jagadish Reddy) ఓడిపోయేవారని వ్యాఖ్యానించారు. ఎస్‌ఎల్‌బీసీపై మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని మండిపడ్డారు. ఆయనకు ఎప్పుడూ ఎక్కడ దోచుకుందామా అనే ఆలోచనలే ఉంటాయని విమర్శించారు. యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌లో ఆయన రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

దిల్లీలో సీఎం రేవంత్​ రెడ్డి, సోనియాగాంధీతో భేటీ

"కీలక శాఖలన్నీ తన వద్దే పెట్టుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ దోపిడీకి పాల్పడ్డారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ బాలకృష్ణనే(HMDA Shiva Balakrishna) కేసీఆర్ దోపిడీకి ఉదాహరణ. అతడు రూ.వందల కోట్ల అక్రమ సంపాదనతో దొరికాడు. మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు సైతం ఐదు వేల ఎకరాలున్నాయి. ఆయన బండారం త్వరలోనే బయటపడుతుంది." అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

Komati Reddy Comments on KCR : అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అడ్డంగా దోచుకొని ఇప్పుడు పక్కదారి పట్టిస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఆయన ఇంకా ప్రైవేటు విమానం లీజ్‌ క్యాన్సిల్‌ చేసుకోలేదన్న మంత్రి, దుబాయ్‌ పారిపోవచ్చనే లీజును కొనసాగిస్తున్నారేమోనని వ్యాఖ్యానించారు. అన్ని విషయాలు అసెంబ్లీ సమావేశాల్లో బయట పడతాయని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.

నాడు ఎన్టీ రామారావు రాళ్ల సీమ అయిన రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని కాలువ తీసుకొచ్చారు. అనంతరం దివంగత వైయస్​ రాజశేఖర్​ రెడ్డి దానిని 44,000 క్యూసెక్కులకు పెంచారు. ఇదే కేసీఆర్ పార్ట్​నర్​ జగన్మోహన్​ రెడ్డి ఈ ప్రాజెక్ట్​ 88,000 క్యూసెక్కులకు పెంచి పనులు నడుపుతున్నారు. కింది ముచ్చుమర్రి అనే గ్రామంలో రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్ పెట్టి, ఆగమేఘాలమీద పనులు నడుపుతున్నారు. ఇద్దరు కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేశారు. - కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, రాష్ట్ర మంత్రి

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి స్థానల్లో గులాబీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. బీఆర్​ఎస్​కు తెలంగాణలో భవిష్యత్‌ లేదని అన్నారు. సీఎం జగన్‌తో(CM Jagan) కలసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన కేసీఆర్, నల్గొండకి వస్తే ప్రజలు తిరగబడి తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు. కేసీఆర్, హారీశ్‌రావు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే నల్గొండకు రావాలని అన్నారు.

కారు షెడ్​కు కాదు స్క్రాప్​ కింద దొంగలు అమ్మేసుకున్నారు : కోమటిరెడ్డి

కావాలని కక్ష సాధించం కానీ - మా మొదటి ప్రాధాన్యత అదే : మంత్రి కోమటిరెడ్డి

Last Updated : Feb 5, 2024, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.