KTR Fire on Minister Konda Surekha Comments : కొండా సురేఖ సంబంధం లేని అంశాల్లోకి లాగితే తమకు సంబంధం ఏంటని మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కేసీఆర్‌పై, తమపై దాడి చేయలేదా? ఎంత దారుణంగా మాట్లాడలేదా అని నిలదీశారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఎలా అంటారన్న కేటీఆర్ ముఖ్యమంత్రి మాట్లాడే థర్డ్ రేట్ మాటలకు ఇద్దరు మంత్రులు వెళ్లి ఫినాయల్ వేసి కడగాలని చురకలు అంటించారు.
హైడ్రాను నడిపిస్తోంది రేవంత్‌రెడ్డి కాదు, రాహుల్ గాంధీనే : డబ్బు సంచుల కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అనుమతిచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాహులే వెనకుండి పేదల ఇళ్లపైకి బుల్డోజర్ పంపిస్తున్నారని ఆరోపించారు. హైడ్రాను నడిపిస్తోంది సీఎం రేవంత్‌రెడ్డి కాదని, రాహుల్ గాంధీయేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మూసీలో పెద్ద ఎత్తున డబ్బులు లూటీ చేయడానికి, కాంగ్రెస్‌కు రిజర్వ్ బ్యాంక్‌లా చేసేందుకు రేవంత్ సర్కార్ పేదల కడుపు కొడుతోందని తీవ్రంగా కేటీఆర్ విమర్శించారు. రూ.లక్షా 50 వేల కోట్లు ఎవరు చెప్పారని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారని, అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పినట్లు ఆయన వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు మధ్య సయోధ్య ఉన్నట్లు కనిపించడం లేదన్న కేటీఆర్, మూసీ ప్రాజెక్టును ఏ కాంట్రాక్టర్‌కు ఇస్తారో 2, 3 రోజుల్లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బయటపెడతామని పేర్కొన్నారు.
KTR Comments On Rahul Gandhi : బుల్డోజర్ ప్రభుత్వంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాహుల్ గాంధీ ఎక్కడున్నారని మాజీ మంత్రి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు నోట్ల కట్టలు కావాలి కానీ, బాధితుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్ అని దుయ్యబట్టారు. దీనిపై డీపీఆర్ కాదు ప్రాజెక్టు రిపోర్టు కూడా లేదని, దీనికోసం డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని అడిగారు.
చిన్న పిల్లవాడు పిలిచినా వస్తానన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడున్నారని, ఇక్కడ ఇంత మంది మరణిస్తుంటే ఎందుకు పలకడం లేదని ప్రశ్నించారు. మూసీలో మూటలు కావాలి కానీ, బాధలు వద్దా అని బదులిచ్చారు. అధినాయకత్వం ఓట్ల కోసమే వస్తారా? స్థానిక నాయకత్వం తప్పు చేస్తే పట్టించుకోరా? అని కేటీఆర్ నిలదీశారు.
సమంత - నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్ : కొండా సురేఖ - Konda Surekha Fires On KTR
బుల్డోజర్ రాజకీయాలపై ప్రజల గళం - రాహుల్ గాంధీకి వినిపించడం లేదా? : కేటీఆర్ - KTR ON MUSI DEMOLITIONS