KTR Lunch Motion Petition In High Court : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ -రేసు వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్‌పైన కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానంలో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. భోజన విరామం తర్వాత ఈ కేసుపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు.
బీఆర్ఎస్ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ప్రధాన నిందితుడు ఏ1గా పేర్కొంటూ తెలంగాణ ఏసీబీ గురువారం కేసు నమోదు చేయగా, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఏ2గా, అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎస్‌ఎన్ రెడ్డి ఏ3గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.
'నేను ఏ తప్పు చేయలేదు భయపడేది లేదు - న్యాయపరంగా ఏం చేయాలో అది చేస్తాం : కేటీఆర్
గవర్నర్ అనుమతి : ఫార్ములా ఈ-రేసు నిర్వహించడడం కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు డబ్బు చెల్లించారంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ ఏసీబీ ఈ ఏడాది అక్టోబరు 18న ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అయితే కేటీఆర్ మంత్రిగా వ్యవహరించిన సమయంలో ఇది చోటుచేసుకోవడంతో కేసు నమోదుకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. కాగా గవర్నర్ ఆమోదించడంతో ఈ నెల 17న సాధారణ పరిపాలనశాఖ మెమో జారీ చేయగా ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ గురువారం కేసు నమోదు చేశారు.
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసుపై సిట్ ఏర్పాటు - తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు