ETV Bharat / politics

కవిత అరెస్టుపై కేసీఆర్ మౌనానికి కారణమేంటో చెప్పాలి? : కిషన్‌రెడ్డి - Kishan Reddy Slams KCR - KISHAN REDDY SLAMS KCR

Kishan Reddy Slams KCR Kejriwal Arrest Comments : దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన కేసీఆర్ అదే కేసులో అరెస్టయిన తన కుమార్తె విషయంపై ఎందుకు స్పందించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కవిత అరెస్టుపై కేసీఆర్ మౌనానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి చేసిన సీఎంను అరెస్ట్ చేస్తే బ్లాక్ డే ఎలా అవుతుందని నిలదీశారు. తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు.

Kishan Reddy
Kishan Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 23, 2024, 5:24 PM IST

Updated : Mar 23, 2024, 7:16 PM IST

కవిత అరెస్టుపై కేసీఆర్ మౌనానికి కారణమేంటో చెప్పాలి? : కిషన్‌రెడ్డి

Kishan Reddy Slams KCR Kejriwal Arrest Comments : దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందిస్తూ కేజ్రీవాల్ అరెస్టయిన రోజు ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో మరో చీకటి రోజుగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు.

Kishan Reddy On Delhi Liquor Scam : కేసీఆర్ వ్యాఖ్యల (KCR On Kejriwal Arrest)ను తప్పబడుతూ, తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో చెప్పాలని నిలదీశారు. కేంద్ర సంస్థలు దాదాపు తొమ్మది సార్లు నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకుండా కేజ్రీవాల్ తప్పించుకున్నారని దుయ్యబట్టారు. దిల్లీ మద్యం కేసులో ఈడీ దర్యాప్తును పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఆ కేసులో సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కిషన్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడ్డారు.

కేజ్రీవాల్​ అరెస్ట్​ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు : కేసీఆర్ - KCR Reaction On Kejriwal Arrest

"దిల్లీ మద్యం కేసులో మీ కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్‌ చెప్పగలరా? దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ (Kejriwal ED Custody)కు సంబంధం లేదని కేసీఆర్‌ చెప్పగలరా? మద్యం పాలసీలో దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం అవకతవకలు చేసింది. కేసీఆర్‌కు సవాలు విసురుతున్నా. దిల్లీ మద్యం కేసులో అక్రమాలను సాక్ష్యాలతో నిరూపిస్తాను. కేజ్రీవాల్ తప్పు లేదని కేసీఆర్‌ నిరూపించగలరా? కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం లేదు." అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Kishan Reddy On MLC Kavitha Arrest : మరోవైపు కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన కేసీఆర్ తన కుమార్తె కవిత అరెస్టుపై ఎందుకు స్పందించలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కవిత అరెస్టు విషయంలో మౌనానికి కారణమేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దిల్లీ లిక్కర్ పాలసీ మార్పులో కవిత (Kavitha ED Custody Extended) ప్రమేయముందని ఈడీ చెబుతోందన్న కిషన్ రెడ్డి, కవిత అరెస్టుతో బీజేపీకి, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. లిక్కర్ పాలసీని మార్చినందుకు అమ్ ఆద్మీ పార్టీకి నిధులు సమకూరాయని ఆరోపించారు. కవిత అరెస్టుపై బీఆర్ఎస్ అవాస్తవాలను ఖండిస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు.

కేజ్రీవాల్‌ జైలు నుంచే పాలన సాగిస్తారా? అందుకు రాజ్యాంగ్యం అనుమతిస్తుందా? - Can Kejriwal Rule From Jail

అవినీతి చేసిన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే బ్లాక్ డే ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలి. కుటుంబ రాజకీయాలు, వారసులు ప్రజాప్రతినిధులు అవటం కూడా బ్లాక్ డేనే. తెలంగాణలో దోచుకున్నట్లు కేసీఆర్ కుటుంబం దిల్లీలో కూడా దోచుకుంది. కవిత అరెస్టుతో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఆమె అరెస్టుతో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పు రాదు. దమ్ముంటే కాళేశ్వరం అవినీతిపైన రేవంత్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలి. ఇచ్చిన హామీలపైన మాటలతోనే సమయం గడుపుతుంది. - కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

లిక్కర్ పాలసీ కేసు- సీఎం కేజ్రీవాల్‌కు మార్చి 28వరకు ఈడీ కస్టడీ - Arvind Kejriwal Arrest

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు - కవిత ఈడీ కస్టడీ మరో మూడ్రోజులు పొడిగింపు - BRS Leader Kavitha ED Custody

Last Updated : Mar 23, 2024, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.