Harish Rao to Fight MLC Kavitha Illegal Arrest in the Supreme Court : ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేసి పోరాడతామని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు తెలిపారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. కవిత అరెస్టును న్యాయపరంగా పోరాడుతామని చెప్పారు. అక్రమ అరెస్టుకు నిరసనగా ఉద్యమిస్తామని అందులో భాగంగా రేపు(శనివారం) రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు మాట్లాడుతూ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నామని తెలిపారు. దుర్మార్గపు చర్యను బీఆర్‌ఎస్ ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటుందని అన్నారు. దుర్మార్గపు చర్యలపై బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. కవిత అరెస్టు(Delhi Liquor Case)పై న్యాయపరంగా పోరాడుతామని వివరించారు. పోరాటాలు, అక్రమ కేసులు ఎదుర్కోవడం తమకు కొత్త ఏం కాదని గుర్తు చేశారు.
కవిత అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికమని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు ధ్వజమెత్తారు. రాజకీయ దురుద్దేశంతో పథకం ప్రకారం కుట్రతో అరెస్టు చేశారని ఆరోపించారు. అరెస్టు గురించి బీజేపీ నేతలు గతంలో పలుమార్లు మాట్లాడారన్నారు. శనివారం లోక్‌సభ షెడ్యూల్ రానుందని, ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కేసీఆర్‌లను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయని విమర్శించారు.
ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు - సెల్ఫోన్లు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
Harish Rao Fires on BJP and Congress : సుప్రీం కోర్టులో చెప్పిన మాటకు విరుద్ధంగా మహిళను అరెస్టు చేశారని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. సుప్రీంలో 19న కేసు విచారణ ఉండగా ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఈ వ్యవహారమంతా ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో దెబ్బతీయాలని కుట్రతో చేశారని, బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు.
"బీఆర్‌ఎస్ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. కవిత అరెస్టుపై సుప్రీంకోర్టులో ఎదుర్కొంటాం. సుప్రీంకోర్టు ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఈడీ వ్యవహరించింది. రాజకీయ కుట్రలో భాగంగా కవిత అరెస్టు జరిగింది. మహిళలకు ఈడీ అరెస్టు అంశంపై సుప్రీంలో కేసు విచారణ జరుగుతుంది. కవితను అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది." - హరీశ్ రావు, బీఆర్‌ఎస్ నేత
Kavitha Arrested Delhi Liquor Scam Case : బీఆర్‌ఎస్ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొందని హరీశ్ రావు అన్నారు. కవిత అరెస్టుపై సుప్రీంకోర్టులో ఎదుర్కొంటామని, సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఈడీ వ్యవహరించిందని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కవిత అరెస్టు జరిగిందని వివరించారు. మహిళలకు ఈడీ అరెస్టు అంశంపై సుప్రీంలో కేసు విచారణ జరుగుతోందన్నారు. కవితను అత్యవసరంగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ - దిల్లీకి తరలింపు
ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం - 'అక్రమ అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటాం'