ETV Bharat / politics

'రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడినట్లు చరిత్రలో లేదు' - Harish Rao Fires On Congress - HARISH RAO FIRES ON CONGRESS

Harish Rao Fires On Congress : రైతు రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ ఛలో ప్రజాభవన్​కు పిలుపునిస్తే కాంగ్రెస్​ ప్రభుత్వానికి వణుకు పుట్టిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజా పాలన అని చెప్పుకుని తిరిగే వారు ఇప్పుడు ఎక్కడికక్కడ పోలీస్​ స్టేషన్లలో నిర్భంధిస్తూ వారిపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.

Harish Rao On Farmers Arrest At Praja Bhavan
Harish Rao On Farmers Arrest At Praja Bhavan (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 6:54 PM IST

Harish Rao On Farmers Arrest At Praja Bhavan : రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజాభవన్​కు పిలుపునిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ శాసనసభ్యుడు హరీశ్​ రావు ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులను, రైతు సంఘాల నాయకులను ఎక్కడికక్కడ పోలీస్​ స్టేషన్లలో నిర్బంధిస్తూ వారిపై కక్ష తీర్చుకుంటోందని ఆక్షేపించారు.

ఆంక్షలు, కంచెలు లేని ప్రభుత్వం అని ఇప్పుడిలా : రుణమాఫీ కోసం పోరుబాట పట్టిన రైతన్నలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అన్న ఆయన, బీఆర్​ఎస్​ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అరెస్టులు చేసిన రైతులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమది ఆంక్షలు లేని ప్రభుత్వం, కంచెలు లేని ప్రభుత్వం, ప్రజా పాలన అంటూ డబ్బా కొట్టుకునే రేవంత్ రెడ్డి ఇదేమిటని ప్రశ్నించారు.

వ్యాఖ్యలు చేసినంత సులువు కాదు : ప్రజా భవన్ చుట్టూ ఎందుకు ఇన్ని బారికేడ్లు, ఎందుకు ఇన్ని ఆంక్షలని హరీశ్​రావు అడిగారు. ప్రజాభవన్​కు రైతులు తరలివస్తున్నారంటే సీఎంకు ఎందుకు అంత భయమని మండిపడ్డారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా మొదలైన రైతుల ఉద్యమాన్ని ఎదుర్కోవడం అంటే రాజకీయంగా వెకిలి మకిలి, చిల్లర వ్యాఖ్యలు చేసినంత సులువు కాదని అన్నారు. రుణమాఫీ ఏమైందని నిలదీసేందుకు వస్తున్న రైతులకు ఏమని సమాధానం చెబుతారని మాజీమంత్రి ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి - ఖర్గేకు హరీశ్​రావు కంప్లైంట్ - Harish Rao Letter To AICC Kharge

రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారని ఇప్పుడది ఆయనకు, ప్రభుత్వానికి ఉరితాడు కాబోతున్నదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ చేసి తీరే దాకా బీఆర్​ఎస్​ పార్టీ వదిలిపెట్టబోదని, తెలంగాణ రైతాంగం కూడా వదిలిపెట్టబోదని అన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం చరిత్రలో ఏనాడూ బాగుపడలేదని హరీశ్​రావు గుర్తు చేశారు.

కేటీఆర్ ట్వీట్ : కాగా రుణమాఫీ కోసం రైతులు ఛలో ప్రజాభవన్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వారిని అరెస్టు చేయడాన్ని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బుధవారం రాత్రి(సెప్టెంబరు 18) నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టుచేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య అని ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఇకనైనా ఆపాలని, పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు.

రుణమాఫీ కోసం పోరాడుతున్న రైతులను అరెస్టు చేయడం దారుణం: కేటీఆర్

'కేసీఆర్​పై బురద చల్లాలని తప్పుడు ఆరోపణలు చేసినా - లెక్కలు మాత్రం అబద్ధాలు చెప్పవు' - ktr comments on MSME Programme

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.