ETV Bharat / politics

నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని అప్పుడే మాట మార్చారు : హరీశ్‌రావు - Harish Rao Fires on Congress Party - HARISH RAO FIRES ON CONGRESS PARTY

Harish Rao Fires on Congress Party : అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదంటూ అప్పుడే కాంగ్రెస్ పార్టీ మాట మార్చిందని మాజీ మంత్రి హరీశ్​రావు విమర్శించారు. సిద్దిపేట బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీశ్​రావు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ, ఈ పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటూ నిలదీశారు.

Lok Sabha Elections 2024
Harish Rao Comments on Congress Party
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 8, 2024, 3:35 PM IST

Harish Rao Fires on Congress Party : అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదంటూ అప్పుడే కాంగ్రెస్ పార్టీ మాట మార్చిందని బీఆర్​ఎస్​ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్​రావు విమర్శించారు. సిద్దిపేట బీఆర్​ఎస్​ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీశ్​రావు, జిల్లా అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్‌(Congress Govt), బీజేపీలకు సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయన్న ఆయన, 100 రోజులు గడిచినా హామీలు నెరవేరలేదని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని మాజీ మంత్రి అన్నారు. తెలంగాణ వద్దంటూ గన్‌ ఎక్కుపెట్టిన వ్యక్తి రేవంత్‌రెడ్డి(CM Revanth) అని, ఆయన ఏనాడైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్‌ ఇచ్చినట్లు చెబుతున్నారని ఆక్షేపించారు. రేవంత్​ సర్కార్ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ, ఈ పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటూ నిలదీశారు.

గెలిచేంత వరకు ఒక మాట-గెలిచాక ఇంకో మాట-ఇదే కాంగ్రెస్ నీతి: కేటీఆర్ - KTR Tweet on Congress Party

"మేము ఎక్కడా మాట ఇవ్వలేదని, నిరుద్యోగభృతి ఇస్తామని ఆరు గ్యారంటీల్లో కానీ ఎన్నికల సమయంలో కానీ మాట ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టి తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నాం కానీ నిరుద్యోగభృతి కోసం ఎక్కడా చెప్పలేదని ఇప్పుడు తప్పుకుంటున్నారు. సరే, ఆ ఉద్యోగాలైనా ఇచ్చారా? కనీసం ఒక్క నోటిఫికేషనైనా ఇచ్చారా? ఏమిలేదు. తీరా చూస్తే బీఆర్​ఎస్​ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను తమవిగా చెప్పుకునే పరిస్థితికి దిగజారారు."-హరీశ్​రావు, సిద్దిపేట ఎమ్మెల్యే

Harish Rao Comments on Raghunandan Rao : గతంలో బీజేపీ నేత రఘునందన్‌రావు కూడా ఎన్నో హామీలు ఇచ్చి, గెలిచాక మరిచిపోయారని గుర్తుచేశారు. మాట తప్పినందుకే రఘునందన్‌రావును దుబ్బాకలో ప్రజలు ఓడించారని హరీశ్​రావు విమర్శించారు. దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్‌లో చెల్లుతుందా అని ఆయన ఎద్దేవా చేశారు. నాడు బీఆర్​ఎస్​(BRS Party) ప్రభుత్వం ఎన్నో ఆలయాలను నిర్మించింది కానీ ఎప్పుడూ దేవుడి పేరుతో ఓట్లు అడగలేదని హరీశ్​రావు పేర్కొన్నారు.

నిరుద్యోగ భృతి హామీ ఇవ్వలేదని అప్పుడే మాట మార్చారు: హరీశ్‌రావు

సీఎం రేవంత్​కు హరీశ్​రావు మరో లేఖ - పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ - HARISH RAO LETTER TO CM REVANTH

ప్రచారాలతో హెరెత్తిస్తున్న బీఆర్​ఎస్ - ఉగాది తర్వాత కేసీఆర్ బహిరంగ సభలు - Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.