Former MP Rapolu Ananda Bhaskar Resigned From BRS : లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. ఏ పార్టీలోకి వెళ్తారో అనే ప్రశ్నకు స్పష్టతనివ్వలేదు. ప్రజా ఉద్యమాల్లో ఉంటానని వెల్లడించారు. విధిలేని పరిస్థితిలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
Rapolu Ananda Bhaskar Comments : బీఆర్ఎస్కు ఆనంద భాస్కర్ చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఏ నిర్ణయాలు తీసుకుంటారో అర్ధం కాని పరిస్థితిలో తనలాంటి నేతలు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022లో కేసీఆర్ అహ్హానం మేరకు బీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు. ప్రాంతీయ ఉద్యమ పార్టీ నుంచి ఇక తన అనుబంధాన్ని తుంచుకుంటున్నాని ప్రకటించారు. బీఆర్ఎస్లో చేరినప్పుడు కేసీఆర్ ఇచ్చిన కండువాను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తున్నాట్లు చెప్పారు.
బీఆర్ఎస్కు షాక్ - బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
BRS EX MP Resigned From Party : తెలంగాణలో సబ్బండ వర్గాల కోసం పోరాడేలా తన భవిష్యత్తు కార్యచరణ ఉంటుందని భాస్కర్ తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతుందని ఆరోపణ చేశారు. ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి, కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. రాష్ట్ర భౌగోళిక స్వరూపం ప్రగతి పరిరక్షణ కోసం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తానని అన్నారు. కులగణన అంశం ఉద్యమాల్లో తన పాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ గణాంకాల కోసం సకల జనుల సర్వే మాత్రమే చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తోందని అన్నారు. కుల, జన గణన దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కొందరికి కంటగింపుగా ఉందని ఆనంద భాస్కర్ అన్నారు. తాను ఏ పార్టీలో చేరతారనేది చెప్పలేనని, ప్రజా ఉద్యమాల్లో ఉంటానని తెలిపారు.
"విధిలేని పరిస్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏ పార్టీలోకి వెళ్తానో చెప్పలేను, ప్రజా ఉద్యమాల్లో ఉంటాను. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోంది. తెలంగాణ భౌగోళిక స్వరూపం ప్రగతి పరిరక్షణ కోసం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తా. కుల జన గణన అంశం ఉద్యమాల్లో నా పాత్ర ఉంటుంది." - రాపోలు ఆనంద భాస్కర్, మాజీ ఎంపీ