CPI Narayana Fires On KCR : కేసీఆర్ అహంభావం, అవినీతి వల్లే ఉద్యమ పార్టీకి కూడా ప్రజలు బుద్ది చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పిల్లర్లు కుంగిపోతే కొంపలు మునిగిపోతాయా అని పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు శాశ్వతంగా రామని బాయ్‌కాట్ చేయడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ ఎందుకు ఎన్నికల్లో పోటీ చేశారని, గెలిచిన తర్వాత అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ధ్వజమెత్తారు. పదేళ్లు ప్రజా సంపాదనను దోచుకుని, ఇప్పుడు అసెంబ్లీకి పోవడం లేదని విమర్శించారు. ఒకప్పుడు కేసీఆర్ అసెంబ్లీ నుంచి గెంటేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ బీజేపీ బాగా తెలివైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి వ్యవహారాన్ని తేల్చే పని సీబీఐకి అప్పగించాలని కోరుతోంది. సీబీఐకి కేసు అప్పగించి మేనేజ్ చేయాలనుకుంటోంది. కేసీఆర్‌ను కాపాడేందుకు తెలంగాణ బీజేపీ చాలా ప్రయత్నిస్తోంది. రూ.వేల కోట్ల అవినీతికి బాధ్యుడైన కేసీఆర్‌పై విచారణ జరిపించారు. మొన్నటి దాకా బీఆర్ఎస్ వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవినీతి చేసిందంతా ఆ పార్టీ నేతలే. సీఎం పదవి ఇస్తే అభివృద్ధి చేస్తామని హరీశ్ రావు అనడం సిగ్గుచేటు. సీఎం పదవి కోసం బీఆర్ఎస్ చాలా ఆరాటపడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకముందే ప్రభుత్వంపై విమర్శలు చేయడం బీఆర్ఎస్ పతనానికి పరాకాష్ట. - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
విద్య, వైద్యం మీద ఖర్చులో రాష్ట్రం వెనకబడి ఉంది: కాగ్ నివేదిక
CPI Narayana On Modi Govt : హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన నారాయణ, కేంద్రప్రభుత్వం, ఏపీ రాజకీయాలపైనా మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతు ద్రోహిలా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను విస్మరించడంతోనే రైతులు ఆందోళన చేపట్టారని అన్నారు. మోదీ సర్కార్ పట్ల ప్రజలు సానుకూలంగా ఉంటే, బీజేపీ ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను ఎందుకు కూలగొడుతోందని ప్రశ్నించారు.
రైలు రోకోకు రైతులు పిలుపు- 4 గంటలపాటు ట్రైన్లు బంద్, చర్చలు ఫలించేనా?
CPI Narayana On Farmers Protest Delhi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓవైపు దేవుళ్లను పూజిస్తూ, మరోవైపు రైతులను చితకబాదుతున్నారని నారాయణ ఆరోపించారు. ఏ దేవుడైనా అన్నం పెట్టే అన్నదాతను కొట్టమని మోదీకి చెప్పారా అని ప్రశ్నించారు. పురాతన దేవాలయాలు, మసీదులను తవ్వించే మోదీ ప్రభుత్వం, చివరకు పార్లమెంట్ పునాదులు తవ్వే ప్రమాదం లేకపోలేదని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థకు గోతులు తవ్వుతోందని ధ్వజమెత్తారు.
'కేంద్ర ప్రభుత్వానికి జగన్ బానిస. అందుకే ఆ ప్రభుత్వం జోలికి పోలేదు. కోడికత్తి పేరుతో జగన్ నాటకాలు అడారు. భారతదేశ చరిత్రలో బెయిల్‌పై సుదీర్ఘకాలంగా బయట ఉన్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. 17ఏ కేసు పెండింగ్‌లో ఉంది. అందుకే చంద్రబాబు కేంద్రానికి దాసోహం అంటున్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీ రెండు పార్టీలు కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్రంలో మాత్రం కొట్లాడుకుంటూ పరోక్షంగా సహకరించుకుంటున్నాయి. విభజన హామీలను ఒక్కటి కూడా కేంద్రం అమలు చేయలేదు. జగన్, చంద్రబాబు తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు.' అని దుయ్యబట్టారు.
'మా డిమాండ్లన్నీ పాతవే'- కేంద్రంతో చర్చలకు రైతులు సై- కర్షకులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం
దిల్లీకి భారీగా రైతులు- హరియాణా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత- కర్షకులపైకి టియర్ గ్యాస్ ప్రయోగం