ETV Bharat / politics

సీఎం రేవంత్​ రెడ్డితో వామపక్ష నేతల భేటీ - ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ప్రకటన - CPI CPM Leaders Met CM Revanth - CPI CPM LEADERS MET CM REVANTH

CM Revanth Reddy Meeting with Left Party Leaders : వామపక్ష పార్టీల నేతలు సీఎం రేవంత్​ రెడ్డితో భేటీ అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై నేతలు చర్చించారు. ఈ సందర్భంగా హస్తం పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

CM Revanth Reddy
Chief Minister Revanth Reddy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 12:17 PM IST

Updated : May 25, 2024, 1:03 PM IST

Left Party Leaders Met CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, తదితరులు హాజరయ్యారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై నేతలు చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై రేవంత్​ రెడ్డి సమీక్షించారని ఎమ్మెల్సీ మహేశ్​కుమార్​ గౌడ్​ పేర్కొన్నారు. సీపీఐ, సీపీఎం, జన సమితి పార్టీలు పూర్తిగా కాంగ్రెస్​కు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే తమ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రజాస్వామ్యం బతకాలంటే తీన్మార్ మల్లన్న గెలవాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించేందుకు సీపీఐ నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా సీపీఐగా కాంగ్రెస్​కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్న ఆయన, మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

రాష్ట్ర వనరులను దోచుకుని కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడింది : కడియం శ్రీహరి - kadiyam Srihari about KCR Family

బీజేపీ, బీఆర్​ఎస్​కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతుగా నిలిచామని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ మద్దతు హస్తం పార్టీకి ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశామని, మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్​ను గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు హస్తం పార్టీని గెలిపించాలని కోరుతున్నామన్న ఆయన, ప్రజా సంక్షేమం వర్ధిల్లాలంటే తీన్మార్​ మల్లన్నను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పల్లా రాజేశ్వర్​ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 27న పోలింగ్​ జరగనుండగా, అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు.

ష్!!​ సౌండ్ ఆఫ్ - నేటితో ముగియనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం - Telangana Graduate MLC By Election

Last Updated : May 25, 2024, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.