ETV Bharat / politics

నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం తర్జనభర్జన - బరిలోకి వైద్య నిపుణురాలు కవితారెడ్డి ! - Congress on Nizamabad MP Candidate - CONGRESS ON NIZAMABAD MP CANDIDATE

Congress Focus on Nizamabad Lok Sabha Candidate : నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది అభ్యర్థి ఎవరన్న అంశం రోజుకో మలుపుతిరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త పేర్లు తెరపైకి వెలుగులోకి వస్తున్నాయి. నిజామాబాద్‌కు చెందిన వైద్యురాలు కవితారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. వైద్యంతో పాటు సామాజికసేవ చేస్తున్న కవితారెడ్డి పేరును కాంగ్రెస్‌ అధిష్ఠానం పరిశీలిస్తోందని చర్చ సాగుతోంది. ఇప్పటికే సర్వే సైతం నిర్వహించినట్టుగా ప్రచారం జరుగుతోంది.

Congress Focus on MP Election in Telangana
Congress Focus on Nizamabad Lok Sabha Candidate
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 22, 2024, 9:13 PM IST

నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం తర్జనభర్జన - బరిలోకి వైద్య నిపుణురాలు కవితారెడ్డి !

Congress Focus on Nizamabad Lok Sabha Candidate : నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి బీజేపీ(BJP) నుంచి ధర్మపురి అర్వింద్, బీఆర్​ఎస్​ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌ పోటీచేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రకటన మాత్రం వాయిదా పడుతూనే ఉంది. కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించిన జాబితాల్లో నిజామాబాద్‌కు చోటు దక్కలేదు. మొదటి నుంచి నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రత్యర్థి పార్టీలు బీసీలను అభ్యర్థులుగా నిలపడంతో ఏంచేయాలోన అంశంపై తర్జనభర్జన పడుతోంది.

Congress Focus on MP Election in Telangana : ఇందూరు లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మొదటి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. రాష్ట్రం నుంచి పంపిన రెండుపేర్లు పంపగా, జీవన్‌రెడ్డి ముందంజలో ఉన్నారని ప్రచారం సాగింది. బీసీ వర్గానికే టికెట్‌ అని ప్రచారం సాగడంతో నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన ఈరవత్రి అనిల్‌ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్‌ పదవుల్లో అనిల్‌కు పదవి దక్కిడంతో అభ్యర్థి రేసు నుంచి తప్పించినట్లయింది. జీవన్‌రెడ్డి ఖరారు అని అనుకుంటుండగా మరో పేరు తెరమీదకు వచ్చింది.

Parliament Elections 2024 : నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు కవితారెడ్డి(Kavitha Reddy) పేరు బయటకు వచ్చింది. జిల్లాలో వైద్యపరంగా కాకుండా వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రీడల్లో బాలికలు రాణించేలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఐఎంఏ(IMA) అధ్యక్షురాలిగా పని చేయడంతోపాటు రాష్ట్ర స్థాయిలో కీలక పదవులు నిర్వహించారు. ఇప్పటివరకు ఆమె క్రీయాశీల రాజకీయాల్లోకి రాలేదు. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికలో కవితారెడ్డి పేరు పరిశీలనకు వచ్చినట్టు జిల్లా నేతలు తెలిపారు. వైద్యురాలిగా మంచి గుర్తింపు ఉండటంతో ఆమె వైపు కాంగ్రెస్‌ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే సర్వే సైతం నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది.

నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ : ప్రత్యర్థి పార్టీలు బీసీ కార్డు ప్రయోగించినందున మహిళను బరిలోకి దింపితే బాగుంటుందని హస్తం పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబానికి సన్నిహితురలిగా కవితారెడ్డికి పేరు ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం తర్జనభర్జన పడుతోంది. ఎవరిని ప్రకటిస్తారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కేజ్రీవాల్​ అరెస్ట్​ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు : కేసీఆర్ - KCR Reaction on Kejriwal Arrest

మరో 2 లోక్​సభ స్థానాలకు బీఆర్​ఎస్​ అభ్యర్థుల ప్రకటన​ - మెదక్ బరిలో మాజీ ఐఏఎస్ - BRS Lok Sabha Candidates 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.