ETV Bharat / politics

లోక్​సభ ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్ - నేడు భువనగిరి నియోజకవర్గ నేతలతో సమావేశం - LOK SABHA ELECTION 2024

CM Revanth Review on Bhuvanagiri Lok Sabha : భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సీఎం రేవంత్​ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఆ పార్లమెంటు ఇంఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరగనుంది.

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 8:01 AM IST

CM Revanth Review on Bhuvanagiri Parliament Constituency Leaders

CM Revanth Review on Bhuvanagiri Lok Sabha : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ పార్టీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. ఒకవైపు నుంచి బీజేపీ, బీఆర్​ఎస్​ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టగా ఆ రెండు పార్టీల దూకుడుకు కళ్లెం వేసేందుకు హస్తం పార్టీ ప్రత్యేక ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు కార్యకర్తలను, నేతలను మేల్కొపుతూ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్​ రెడ్డి(CM Revanth Reviews) వరుస సమీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు.

ఈసారి ఎలాగైనా తెలంగాణ నుంచి కాంగ్రెస్​ 14 స్థానాల్లో విజయం సాధించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఈ క్రమంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలతో పాటు పార్టీ ఎక్కడ బలహీనంగా ఉందో తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే విధంగా సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా సమీక్షలో భాగంగా బుధవారం భువనగిరి లోక్​సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో సీఎం రేవంత్​ రెడ్డి సమావేశం కానున్నారు. పార్లమెంటు ఇంఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి నివాసంలో ఈ సమావేశం జరగనుంది.

ఈ సమీక్ష మీటింగ్​కు సీఎం రేవంత్​ రెడ్డి హాజరు కానున్నట్లు కాంగ్రెస్​ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భువనగిరి లోక్​సభ అభ్యర్థి చామల కిరణ్​ కుమార్​ రెడ్డి(Bhuvanagiri Congress MP Candidate Kiran Kumar Reddy), ఎమ్మెల్యే కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి, మందుల శామేలు, వేముల వీరేశం, మల్​రెడ్డి రంగారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలతో పాటు ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నియమితులైన కో ఆర్డినేటర్లు కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

జహీరాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గ ముఖ్య నేతలతో సీఎం రేవంత్​ భేటీ

కొడంగల్​ నేతలతో సీఎం సమావేశం : సోమవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్​నగర్​ పార్లమెంటు నియోజకవర్గంలోని తన సొంత నియోజకవర్గమైన కొడంగల్​ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కొడంగల్(Congress Kodangal Meeting)​లో కాంగ్రెస్​ను ఓడించి రేవంత్​ రెడ్డిపై కక్ష తీర్చుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ధ్వజమెత్తారు. అందుకే ఈ ఎన్నికల్లో కొడంగల్​ ప్రజలు కాంగ్రెస్​ అభ్యర్థి వంశీ చంద్​ రెడ్డిని గెలిపించాలని కోరారు.

CM Revanth Review on Lok Sabha Leaders : అంతకు ముందు సికింద్రాబాద్​, వరంగల్​ పార్లమెంటు నియోజకవర్గాల ఇంఛార్జిలతో పాటు పార్టీ ముఖ్యనేతలు, అభ్యర్థులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈసారి ఎలాగైనా ఆయా నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలిచి తీరాలని సూచించారు. సికింద్రాబాద్​ నేతలతో జరిగిన సమీక్ష సమావేశంలో కాంగ్రెస్​ అభ్యర్థి దానం నాగేందర్​తో పాటు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వరంగల్​ నియోజకవర్గం అభ్యర్థి కడియం కావ్యతో పాటు ఇంఛార్జి మంత్రి కొండా సురేఖతోనూ సమీక్ష నిర్వహించారు. ఈ రెండు భేటీలు హైదరాబాద్​ వేదికగా సాగాయి. జహీరాబాద్​ నియోజకవర్గ నేతలతోనూ సీఎం భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సీఎం రేవంత్​ రెడ్డి మరిన్ని సమీక్షలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కూన శ్రీశైలం గౌడ్ ​- సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక

కాంగ్రెస్​ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రత్యేకం : సీఎం రేవంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.