ETV Bharat / politics

రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చ అవసరం : సీఎం రేవంత్​

CM Revanth Reddy Said Special Act for Tenant Farmers : రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. కౌలు రైతుల రక్షణకు చట్టం రూపొందించే యోచనలో ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. సచివాలయంలో పౌరసంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

Tenant Farmers in Telangana
CM Revanth Reddy Said Special Act for Tenant Farmers in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 7:14 PM IST

Updated : Mar 1, 2024, 8:14 PM IST

CM Revanth Reddy Said Special Act for Tenant Farmers : త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. రాష్ట్రంలో విద్యా విధానం(New Education Policy) ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందన్నారు. రైతులు, కౌలుదారుల సమస్యలు, సంక్షేమం, వ్యవసాయరంగ సంస్కరణలపై రైతు కమిషన్ సూచనలు ఇవ్వనుందని సీఎం తెలిపారు. సచివాలయంలో పలువురు సామాజిక, పౌర సంఘాల ప్రతినిధులతో సీఎం చర్చించారు. కౌలు రైతుల రక్షణపై అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

అందరి సూచనలు తీసుకొని కౌలు రైతుల(Tenant Farmers) రక్షణకు చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సీఎం తెలిపారు. పంట పెట్టుబడి కోసం రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. నిస్సహాయులకు, నిజమైన లబ్ధిదారులకు అవసరమైతే చెప్పిన దానికంటే ఎక్కువ సాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలో పంట మార్పిడి పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని, అన్ని పంటలు విస్తరించేలా రైతులు సరికొత్త విధానాలను అనుసరించాలన్నారు.

గురుకులాల సమీకృత భవన సముదాయం : రాష్ట్రంలో విద్యాలయాలను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఒకే చోట ఉండేలా సుమారు 25 ఎకరాల్లో సమీకృత భవన సముదాయం నిర్మించనున్నట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్​లో ఇంటిగ్రేటేడ్ క్యాంపస్ నెలకొల్పి దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. అన్ని గురుకులాలు ఒకే చోట ఉండటం వల్ల కుల, మత వివక్ష తొలగడంతో పాటు విద్యార్థుల్లో ప్రతిభా పాఠవాలు, పోటీతత్వం పెరుగుతాయన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పడిన చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రూప్ 1, మెగా డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయని యూపీఎస్సీ తరహాలో టీఎస్​పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామన్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్-2050

Special Act for Tenant Farmers in Telangana :కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్​ను పునరుద్ధరించామని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ప్రజా భవన్​ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రేవంత్ రెడ్డి, ప్రజాపాలనలో దరఖాస్తులను స్వీకరించినట్లు వివరించారు. మహిళలు, నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేశామని రైతులు, నిరుద్యోగులకు ప్రయోజనాలు చేకూరేలా మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, యోగేంద్ర యాదవ్, కోదండరాం, హరగోపాల్, విశ్వేశ్వర్ రావు, రమ మేల్కొటే, రియాజ్, పురుషోత్తం, గాదె ఇన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

గత పదేళ్లలో కేసీఆర్‌ వందేళ్లలో చక్కదిద్దలేనంత విధ్వంసం చేశారు : సీఎం రేవంత్

ప‌న్ను వ‌సూళ్లలో నిర్దేశించిన వార్షిక ల‌క్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాలి : సీఎం రేవంత్​

Last Updated : Mar 1, 2024, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.