ETV Bharat / politics

ఈరోజు సాయంత్రం కర్ణాటకకు రేవంత్ - లోక్​సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం - CM Revanth Reddy Karnataka Tour

Revanth Karnataka Tour 2024 Today : సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ సాయంత్రం కర్ణాటకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్​సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు.

CM REVANTH REDDY KARNATAKA TOUR
CM REVANTH REDDY KARNATAKA TOUR
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 12:06 PM IST

Updated : Apr 20, 2024, 1:47 PM IST

CM Revanth Visits Karnataka Today : సీఎం రేవంత్‌రెడ్డి చరిష్మాను తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన చోట ప్రచారానికి వెళ్లాలని పార్టీ అధినాయకత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు పక్క రాష్ట్రాలైన ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రేవంత్‌రెడ్డి ప్రచార బరిలోకి దిగారు. నాలుగు రోజుల క్రితం రెండ్రోజుల పాటు ముఖ్యమంత్రి కేరళలో పర్యటించారు. తాజాగా ఈరోజు సాయంత్రం రేవంత్‌రెడ్డి కర్ణాటకు వెళ్లనున్నారు. అక్కడి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు.

ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా : రేవంత్​​రెడ్డి - CM Revanth in Jana Jathara Sabha

CM Revanth Reddy Campaign in Other States : తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రేవంత్‌రెడ్డికి రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఇమేజ్‌ భారీగా పెరిగింది. గత కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలోనూ తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇటీవలే వైజాగ్‌లో ఏపీసీసీ నిర్వహించిన బహిరంగ సభకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన క్రేజ్‌ను ఇతర రాష్రాల్లోనూ వాడుకోవాలని హస్తం పార్టీ నిర్ణయంలో భాగంగా పొరుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు.

Congress Election Strategy in Telangana : మరోవైపు తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మిషన్-15 పేరుతో 15 స్థానాలు విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పార్టీకి అనుకూల వాతావరణం ఉండడం, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు అంతా మంత్రులు, సీనియ నాయకులు ఉండటంతో గెలుపు బాధ్యతను వారికే అప్పగించారు. ఈ క్రమంలోనే పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి, తమ ప్రభుత్వ పథకాల అమలు వివరిస్తున్నారు. శుక్రవారం నాడు మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టారు.

జూన్ 9న రాహుల్​ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం : రేవంత్​ రెడ్డి - CM REVANTH REDDY IN WAYANAD

రాష్ట్రంలో 14 ఎంపీలను గెలిపించి సోనియమ్మకు కానుకగా ఇద్దాం : సీఎం రేవంత్​ - Lok Sabha Polls 2024

Last Updated : Apr 20, 2024, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.