CM Jagan Attack Case Update : ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు? సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. ఎందుకంటే శాంతి, భద్రతల అంశం పోలీసుల పరిధిలోనిది కనుక. కానీ ఎక్కడైనా వీఆర్వో వద్దకు వెళ్లి సమాచారం పంచుకోవడం చూశామా? అక్కడ ఆ వ్యక్తి స్టేట్‌మెంట్‌ను వీఆర్వో నమోదు చేసి ఆ తర్వాత దీన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడం వింతగా లేదూ? ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోనో లేక స్టేషన్‌కు చాలా దూరంలో ఉండే ప్రాంతంలో జరిగింది కాదు. సాక్షాత్తు పరిపాలన కేంద్రమైన విజయవాడ నగరంలో.
అది కూడా స్టేషన్‌కు 1.5 కి.మీ దూరంలో ఉండే వ్యక్తి ఇలా చేశాడంటే నమ్మశక్యంగా ఉందా? కానీ, విజయవాడ ఘనమైన నగర పోలీసులు దీనిని నిజం చేసి చూపించారు. గులకరాయి కేసులో నగర పోలీసులు కోర్టుకు సమర్పించిన కేస్ డైరీ రెండో భాగంలోని ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతోంది. ఆదేంటో మీరే చూడండి.
జనాలు లేక వెలవెల బోయిన జగన్ బస్సుయాత్ర - ఎండలోనే కొద్దిపాటి జనం - CM Jagan Bus Yatra
'మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై 13న రాత్రి విజయవాడ శివారు సింగ్‌నగర్‌లోని డాబాకొట్ల రోడ్డులో గుంపులో నుంచి వచ్చిన రాయి తగిలి స్వల్ప గాయమైంది. ఈ ఘటన జరిగిన సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో అంతా చీకటిగా ఉంది. పోలీసులు నిందితుడిగా చూపిన సతీష్, రాయి విసిరిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో కేసు తేలిపోకుండా ఉండేందుకు నానా తిప్పలు పడినట్లు కనిపిస్తోంది. 16వ తేదీన సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరిలో మేజర్ అయిన సతీష్‌ను ఏ1గా చూపించారు. మిగిలిన వారు మైనర్లు. వీరిలో ఇద్దరిని సాక్షులుగా చేర్చారు. వీరి నుంచి తీసుకున్న స్టేట్మెంట్లలో జగన్‌పై రాయితో దాడి చేస్తే ఏ1 సతీష్‌కు టీడీపీ నేత దుర్గారావు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని ఆశ చూపించినట్లు చెప్పారు. తాము వద్దని వారించినా ముఖ్యమంత్రిపైకి ఏ1 రాయి విసిరాడని పేర్కొన్నారు. తమకు సతీష్ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పినట్లు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
తొమ్మిదో సాక్షిగా ఉన్న బాలుడు సతీష్ రాయి వేసిన సంగతిని తన తండ్రి ఎల్లయ్యకు చెప్పాడంట. ఇది విని భయపడిన ఎల్లయ్య, వెంటనే నార్త్ తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. జగన్‌పై ఏ1 రాయి విసిరాడని చెప్పగానే ఆమె తండ్రీకుమారుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసి, వాటిని చర్యల నిమిత్తం పోలీసులకు పంపించినట్లు కోర్టుకు సమర్పించిన స్టేట్మెంట్లలో ఉంది. తమకు అనుకూలంగా పోలీసులు రాయించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గులక రాయి కేసులో పోలీసులు 12 మందిని సాక్షులుగా చేర్చారు. ఇందులో వెలంపల్లి, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన పోతిన మహేష్ ఉన్నారు. ఆరో సాక్షిగా జగన్ వ్యక్తిగత సహాయకుడు మనోహర్ నాయుడును చూపించారు. ఏడు, ఎనిమిది సాక్షులుగా నందిగామ ఏసీపీ రవికాంత్, నందిగామ సీఐ హనీష్ పేర్లను చేర్చారు.
జగన్‌పై దాడి కేసులో పురోగతి - పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు - Stone Attack on Jagan in AP
ఇద్దరు బాలురు, వీఆర్వో స్వర్ణలత, ఓ బాలుడి తండ్రి దుర్గారావును సాక్షుల జాబితాలో పోలీసులు చేర్చారు. ఈనెల 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు సింగ్‌నగర్ నుంచి వడ్డెర కాలనీకి చెందిన దుర్గారావును పోలీసులు తీసుకెళ్లారు. మూడు రోజులు అవుతున్నా ఇంత వరకు దుర్గారావుకు సంబంధించి అరెస్టు చూపడం కానీ, కుటుంబ సభ్యులకు సమాచారం కానీ పోలీసులు ఇవ్వలేదు. సతీష్‌కు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ఆశపెట్టి రాయి వేయించాడని సాక్షుల వాంగ్మూలాల్లో ఉంది. దీన్ని బట్టి దుర్గారావును ఏ2గా చేర్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇతని నుంచి ఇంకా ఎవరినైనా గులకరాయి కేసులో ఇరికించే అవకాశం ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అందుకే పోలీసులు జాప్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
వడ్డెర కాలనీకి చెందిన వారి ఆచూకీ కోసం కోర్టు అనుమతితో అడ్వకేట్ కమిషనర్ శ్రీకాంత్ గురువారం రాత్రి సింగ్‌నగర్ స్టేషన్, పశ్చిమ ఏసీపీ కార్యాలయం, సీపీ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఈ మూడు చోట్లా ఎవరూ లేకపోవడంతో, ఇదే విషయాన్ని ఆయన తన నివేదికలో న్యాయాధికారి రమణారెడ్డికి సమర్పించారు. రిమాండ్ పడిన ఏ1 సతీష్‌ను విజయవాడ జైలు ద్వారా నెల్లూరు కేంద్ర కారాగారానికి పంపించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎస్కార్ట్ లేకపోవడంతో గురువారం రాత్రి నుంచి నిందితుడిని విజయవాడ కారాగారంలోనే ఉంచారు.
ఏంటీ!! వీళ్లు మంచోళ్లా? - వాళ్లు చేసే అరాచకాలు చూసే అంటున్నావా జగన్! - Lok sabha Election2024 IN AP