ETV Bharat / politics

చేవెళ్ల లోక్​సభలో త్రిముఖ పోటీ - ఎవరు గెలుస్తారో? - Chevella Lok Sabha Polls

Chevella Lok Sabha Election Fight 2024 : చేవెళ్ల లోక్‌సభ స్థానం ఎన్నికలు మరింత అసక్తికంగా మారాయి. బీఆర్​ఎస్​ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, బీజేపీ నుంచి కొండావిశ్వేశ్వర్ రెడ్డి పోటీ పడుతుండగా కాంగ్రెస్ నుంచి పట్నం సునీతారెడ్డి బరిలో దిగే అవకాశం ఉంది. అమె పేరును అధిష్ఠానం ఖరారు చేయాల్సి ఉంది. చేవెళ్ల ఎంపీ స్థానాన్ని ఒకసారి కాంగ్రెస్ కైవసం చేసుకోగా రెండుసార్లు బీఆర్​ఎస్​ దక్కించుకుంది. ఐతే బరిలో నిలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికని సవాల్‌గా తీసుకోగా కాంగ్రెస్, బీఆర్​ఎస్​లు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

Lok Sabha Election Fight 2024
Chevella Lok Sabha Election Fight 2024
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 14, 2024, 8:41 PM IST

Updated : Mar 14, 2024, 10:06 PM IST

చేవెళ్ల లోక్​సభలో త్రిముఖ పోటీ - ఎవరు గెలుస్తారో

Chevella Lok Sabha Election Fight 2024 : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ ఎన్నిక ఈసారి రసవత్తరంగా ఉండబోతుంది. ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడంతో త్రిముఖపోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి, వికారాబాద్ జిల్లా జెడ్పీఛైర్​పర్సన్​ నీతా మహేందర్​ రెడ్డి పేరు దాదాపుగా ఖాయమైంది. ఆమె పేరు కాంగ్రెస్(Congress) అధికారికంగా ఖరారు ప్రకటించాల్సి ఉంది.

ఇప్పటికే కుదిరిన ఒప్పందం మేరకు సునీతారెడ్డి కుటుంబం ఇటీవల బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేసి హస్తం పార్టీలో చేరింది. తొలి జాబితాలో ఆమె పేరు ఉన్నా చివరి క్షణంలో పెండింగ్​లో పెట్టారు. క్షేత్రస్థాయిలో ఆమె ప్రచారాన్ని మొదలుపెట్టారు. మాజీ మంత్రి మహేందర్​ రెడ్డి సతీమణిగానే కాకుండా క్షేత్రస్థాయిలో మంచిపేరు, గుర్తింపు సహా గత పరిచయాలు కలిసివస్తాయని నేతలు చెబుతున్నారు.

బీఆర్​ఎస్​ నుంచి బరిలో కాసాని : సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి మరోసారి పోటీకి ఆసక్తి చూపకపోవడంతో అభ్యర్థి కోసం బీఆర్​ఎస్​ నాయకత్వం పలుపేర్లు పరిశీలించింది. గతంలో అక్కడ నుంచి పోటీపడిన అనేక మంది సీనియర్లు మారిన రాజకీయ పరిస్థితులతో వెనకడుగు వేశారు. చివరకు తర్జనభర్జనపడి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ పేరును బీఆర్​ఎస్​ ఖరారు చేసింది. కాంగ్రెస్, టీడీపీలలో పలు హోదాల్లో కాసాని పని చేశారు.

బాచుపల్లిలో సాధారణ కార్యకర్తగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్రస్థాయి వరకు సాగింది. గతేడాది టీడీపీ(TDP) రాజీనామా చేసి కేసీఆర్​ సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గం ఉండటంతో కాసాని వైపు బీఆర్​ఎస్​ మొగ్గు చూపింది. ఆయన్ని గెలిపించే బాధ్యతను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీసుకున్నట్లు తెలుస్తోంది.

"బీజేపీ నలుమూలలకు పోయింది. నరేంద్ర మోదీ నలుమూలలకు పోయారు. అన్ని స్థాయిల నాయకులు కూడా ఇది మోదీ వర్సెస్​ రాహుల్​ గాంధీ అని అంటున్నారు. మోదీకి చేవెళ్ల గ్యారంటీ, చేవెళ్లకు మోదీ సీటు గ్యారంటీ. ప్రజలందరికీ మోదీపై విశ్వాసం వచ్చింది. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది." - కొండా విశ్వేశ్వర్​ రెడ్డి, బీజేపీ అభ్యర్థి

తెలంగాణలో ఎన్నికల ప్రచార స్పీడు పెంచిన బీజేపీ - అమిత్​ షా రాకతో కొత్త జోష్!

Chevella Lok Sabha Candidate Konda Vishweshwar Reddy : బీజేపీ(BJP) నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచిన విశ్వేశ్వర్​ రెడ్డి 2018లో రాజీనామా చేసి సోనియా సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. 2019లో మరోసారి ఎంపీగా పోటీ చేశారు. స్వల్ప మెజార్టీతో బీఆర్​ఎస్​ అభ్యర్థి రంజిత్​ రెడ్డిపై ఓడిపోయారు. ఆ తర్వాత 2021లో కాంగ్రెస్​కు రాజీనామా చేసి 2022లో బీజేపీలో చేరారు. అనూహ్యంగా మరోసారి బీజేపీ నుంచి చేవెళ్ల ఎంపీ టికెట్​ దక్కించుకున్న విశ్వేశ్వర్​ రెడ్డి ఈసారి ఎన్నికను సవాల్​గా తీసుకున్నారు. పార్టీ శ్రేణులతో పాటు ఆర్​ఎస్​ఎస్​ అనుబంధ సంస్థలతో ఇంటింటా ప్రచారంపై దృష్టి సారించారు. గతంలో ఎంపీగా పని చేసిన అనుభవం ఉండటం, చేవెళ్ల, వికారాబాద్​ నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా క్యాడర్​ ఉండటం కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.

Lok Sabha Polls 2024 : చేవెళ్ల లోక్​సభకు ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగ్గా 2009లో కాంగ్రెస్​ గెలిచింది. జైపాల్​రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014,2019లో రెండుసార్లు బీఆర్​ఎస్​ విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో చేవెళ్ల సీటు మాదంటే మాదేనని కాంగ్రెస్, బీఆర్​ఎస్​ చెబుతుండగా, చేవెళ్ల గడ్డ తమదేనని ధీమాతో బీజేపీ ఉంది.

జహీరాబాద్​ బీఆర్​ఎస్​ లోక్​సభ అభ్యర్థిగా గాలి అనిల్​ కుమార్​! - ఖరారు చేసిన కేసీఆర్

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి -​ ఎంపీ అభ్యర్థులకు సీఎం రేవంత్​ కీలక సూచనలు

Last Updated : Mar 14, 2024, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.