Chandrababu wishes to Bhuvaneshwari : నారా భువనేశ్వరికి ఆమె భర్త, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కుమారుడు నాకా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే తన తపనలో వందశాతం అండగా నిలిచారని భువనేశ్వరిని చంద్రబాబు ప్రశంసించారు. తనకెప్పుడూ సహకరిస్తూ చీకటి రోజుల్లోనూ నవ్వుతూ తన అభిరుచిని అనుసరించారని ట్వీట్ చేశారు.
అటు లోకేష్ కూడా అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆమె ప్రేమ, దయ, మద్దతు తనకు పెద్ద బలమని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం, వ్యాపార చతురత, న్యాయం కోసం పోరాడడం పట్ల ఆమె అంకితభావం తనకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రేమతో తమ జీవితాలను ప్రకాశవంతం చేస్తున్న అమ్మ భువనేశ్వరి ఎప్పుడూ సంతోషంగా ఉండాలని లోకేష్ ఆకాంక్షించారు.
Minister Gottipati Ravi Kumar Wishes To Nara Bhuvaneshwari : మంత్రి గొట్టిపాటిరవికుమార్ నారా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కష్టకాలంలో భువనేశ్వరి చూపిన తెగువ, చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు సడలని ఆమె ధైర్యం అందరికీ స్ఫూర్తి దాయకమని మంత్రి అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యం కోల్పోకుండా నిజాన్ని గెలిపించారని ఆయన గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నారా భువనమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజం గెలవాలి బృంద సభ్యుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవలు అందిస్తూ పేదవారికి అండగా ఉంటూ ముందుకు సాగుతున్న భువనమ్మకు నిజం గెలవాలి టీం సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ప్రజలంతా చైతన్యం పొందారని నిజాన్ని గెలిపించారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నిజం గెలవాలి కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, కో కోఆర్డినేటర్ వాలంటీర్ల ఇంచార్జ్ రవి నాయుడు, మీడియా కోఆర్డినేటర్ జస్వంత్ కాసరనేని, టీం సభ్యులు శ్రీధర్, రంజిత్, బాబి, విజయ్, పత్తిపాటి శ్రీనివాస్, ప్రణీత్, ప్రదీప్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 29న హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ - పోస్టర్‌ను ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు