ETV Bharat / politics

'హైదరాబాద్​ ప్రతిష్ఠ రోజురోజుకూ పడిపోతోంది - మార్పు పేరుతో పాలనను గాలికొదిలేశారు' - Vivekananda Goud Fires on Congress - VIVEKANANDA GOUD FIRES ON CONGRESS

BRS MLA Vivekananda Goud Fires on Congress : మార్పు పేరుతో కాంగ్రెస్​ లీడర్లు పాలనను గాలికి వదిలేశారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్​ ఆరోపించారు. హైదరాబాద్​లో స్థిరాస్తి రంగం పడిపోయి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ భవన్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

BRS MLA Vivekananda Goud Fires on Congress
BRS MLA Vivekananda Goud Fires on Congress (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 15, 2024, 1:40 PM IST

Updated : Jul 15, 2024, 3:25 PM IST

BRS MLA Vivekananda Goud Press Meet : హైదరాబాద్​ ప్రతిష్ఠ రోజురోజుకూ పడిపోతోందని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కేవీ వివేకానంద గౌడ్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్​ వచ్చి వ్యాపారం చేస్తారని, స్థిరాస్తి రంగం పడిపోయి వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. పాలన బాగుందని కాంగ్రెస్​ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు.

హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో ఈ మేరకు మాట్లాడిన ఆయన, కాంగ్రెస్​ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైదరాబాద్​ నగర శివారు ప్రాంతాలను జీహెచ్​ఎంసీలో విలీనం చేసి హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి అంటున్నారని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్​ ఆరోపించారు. ఈ హైడ్రా ఏర్పాటును బీఆర్​ఎస్​ వ్యతిరేకిస్తోందని స్పష్టంగా చెప్పారు.

ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తోన్న హైడ్రాను బీఆర్​ఎస్​ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు. 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల గడువు ముగుస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. 7 కార్పొరేషన్లు, 33 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టాలన్నారు. మార్పు పేరుతో కాంగ్రెస్​ నేతలు పాలనను గాలికొదిలేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల స్ఫూర్తికి విరుద్ధంగా రేవంత్​ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

శివారు ప్రాంతాల విలీనానికి బీఆర్​ఎస్​ వ్యతిరేకం : అధికార వికేంద్రీకరణ చేయాల్సింది పోయి అధికార కేంద్రీకరణ వైపు అడుగులు వేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్​ నగర శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూకబ్జాలు, అవినీతి చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్​ ఆరోపణలు చేశారు. మూడు కార్పొరేషన్లు చేసి అధికారం చెలాయించాలని రేవంత్​ రెడ్డి భావిస్తున్నారన్నారు. శివారు ప్రాంతాలను విలీనం చేయడం ద్వారా ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పారు. అలాగే శివారు ప్రాంతాల విలీనాన్ని బీఆర్​ఎస్​ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.

శివారు ప్రాంతాలను విలీనం చేసేటప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని వివేకానంద గౌడ్​ చెప్పారు. బీఆర్​ఎస్​ హయాంలో మంచిగా పనిచేయడం వల్లే గ్రేటర్​ పరిధిలో బీఆర్​ఎస్​ ఎక్కువ సీట్లు గెలుచుకుందని అన్నారు. గ్రేటర్​ పరిధిలో పారిశుద్ధ్యం లోపించి, విష జ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. గ్రేటర్​ పరిధిలో కాంగ్రెస్​ పార్టీకి పట్టు లేదు అందుకే ఎన్నికలను కాలయాపన చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

నేను బీఆర్​ఎస్​లోనే ఉంటాను : బీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధిని కొనసాగించడంలో రేవంత్​ రెడ్డి విఫలమయ్యారని ఎమ్మెల్యే వివేకానంద ధ్వజమెత్తారు. తానే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని పిటిషన్​ వేశానని ఎమ్మెల్యేలపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను చేర్చుకుని సీఎం రేవంత్​ రెడ్డి రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. తాను కేసీఆర్​ నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పి, విమర్శకులకు బదులిచ్చారు.

రూ.2 లక్షల రుణమాఫీ ఎవరికి చేస్తారో గ్రామాల వారీగా జాబితా ప్రకటించాలి : మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డి - ex mini Niranjan Reddy on runa mafi

2026 నాటికి విశాల నగరంగా హైదరాబాద్ - జీహెచ్‌ఎంసీని ఔటర్‌ వరకు విస్తరించేందుకు ప్రణాళికలు - GHMC Expansion Plan

Last Updated : Jul 15, 2024, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.