ETV Bharat / politics

సీఎం రేవంత్​రెడ్డితో బీఆర్ఎస్​ ఎమ్మెల్యే, ఎంపీ భేటీ - కాంగ్రెస్​ గూటికి చేరువయ్యేనా?

BRS MLA Danam Met with CM Revanth : ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయ పరిమాణాలు కీలకంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్​ఎస్​ పార్టీకు చెందిన పార్టీ కీలక నేతలు దానం నాగేందర్, పసునూరి దయాకర్​ భేటీ అయ్యారు. ఇరువురు వేరువేరుగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో వారి పార్టీ మార్పు ఖాయమని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Khairatabad MLA Danam Meets Revanth
BRS MLA Danam Met with CM Revanth
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 15, 2024, 3:08 PM IST

Updated : Mar 15, 2024, 6:32 PM IST

BRS MLA Danam Met with CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ఇవాళ కలిశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌ నివాసంలో కలవగా, సిట్టింగ్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ పసునూరి దయాకర్​ సచివాలయంలో వేరువేరుగా కలిశారు. వరంగల్‌లో సిట్టింగ్‌ ఎంపీని పక్కన పెట్టి, కడియం శ్రీహరి(MLA Kadiam Srihari) కుమార్తె కావ్యకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న దయాకర్‌ ఇవాళ సీఎం రేవంత్​తో కలిశారు.

BRS Warangal MP Pasunuri Dayakar Meet Revanth Reddy : కానీ కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ టికెట్‌ ఎవరికి ప్రకటించనందున ఇప్పటికే టికెట్‌ ఆశిస్తున్న దొమ్మాటి సాంబయ్య, స్టేషన్‌ ఘనపూర్‌ ఇందిరలతోపాటు దయాకర్‌ కూడా పోటీ పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 18వ తేదీన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

దిల్లీ మద్యం కుంభకోణం కేసు - ఎమ్మెల్సీ కవితను అరెస్ట్​ చేసిన ఈడీ అధికారులు

అదే రోజున దానం నాగేందర్‌ కూడా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. సీఎంతో దానం భేటీ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్​ఛార్జి కార్యదర్శులు రోహిత్ చౌదరీ, విష్ణునాథ్, మన్సూర్ అలీఖాన్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్​ గూటికి చేరువయ్యేనా? : గత కొన్ని రోజులుగా ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డి, దానం నాగేందర్‌ అనుచరులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు దానం నాగేందర్‌(MLA Danam Nagender) సుముఖంగా ఉన్నట్లు తెలుసుకున్న తరువాతనే ఇవాళ సీఎంను కలిసేందుకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమైన నాయకులను పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్‌ రెడ్డి కలిసే సమయంలో అవకాశం ఉన్న మేరకు సీనియర్లను కూడా కలుపుకుని పోవాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది.

ఖమ్మం లోక్​సభ సీటు కోసం టఫ్ ఫైట్ - విశ్వప్రయత్నాలు చేస్తున్న నేతలు

మరోవైపు చేవెళ్ల బీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డి కూడా సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం కాని రేపుకాని సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా రానున్న రెండు మూడు రోజుల్లో పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.

BRS Leaders Join in Congress, BJP : లోక్​సభ ఎన్నికల వేళ బీఆర్​ఎస్​ పార్టీలో రాజకీయ వలసలు రాజుకుంటున్నాయి. ఓవైపు అధికార పక్షం కాంగ్రెస్, మరోవైపు బీజేపీలోకి కీలక నేతలు వలసలు వెళ్తున్నారు. తాజాగా కుమురం భీం అసిఫాబాద్ జిల్లా​ అధ్యక్షుడు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హస్తం గూటికి చేరారు. శాసనసభ్యుడుగా ఓడిపోయిన తాను నియోజకవర్గ అభివృద్ధి(Constituency Development) కోసమే కాంగ్రెస్​లో చేరినట్లు తెలిపారు.

అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల వేళ పలువురు సీనియర్‌ నేతలు బీజేపీ గూటికి చేరారు. మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ పార్లమెంట్​ సభ్యులు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌, హుజూర్‌నగర్‌, కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, దిల్లీలో తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు - రాజకీయాల నుంచి తప్పుకుంటా : మల్లారెడ్డి

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు కోనప్ప రాజీనామా - రేపు కాంగ్రెస్​లో చేరిక

Last Updated : Mar 15, 2024, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.