BRS declared Vaviraju Ravichandra : భారత రాష్ట్ర సమితి రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరు ఖరారైంది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిగా రవిచంద్ర పేరును బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు(KCR) ఖరారు చేశారు. పార్టీ పెద్దలు, ముఖ్యులతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రవిచంద్రకు కేసీఆర్ బీఫారం కూడా అందించారు. వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ అభ్యర్థిగా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రవిచంద్ర రాజ్యసభ అవకాశం దక్కడం ఇది రెండో మారు. బండ ప్రకాష్ రాజీనామాతో 2022 లో వచ్చిన ఉపఎన్నికకు అభ్యర్థిగా అవకాశం కల్పించిన బీఆర్ఎస్, ఇప్పుడు మరోమారు అవకాశం ఇచ్చింది.
కాంగ్రెస్ వైఖరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన - సభ నుంచి వాకౌట్
Rajya Sabha Elections 2024 Schedule : రాజ్యసభ ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదలయింది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్య సభ సభ్యుల ఎన్నికకు(Rajya Sabha Elections) కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్‌ఎస్ ఎంపీలైన వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్‌ల పదవీ కాలం ముగియడంతో వారి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Rajya Sabha Seats In Telangana : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు, బీఆర్ఎస్ ఒక స్థానానికి పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు(Congress) సంఖ్యాపరంగా 64 మంది, మిత్రపక్షమైన సీపీఐకి ఒకరు, బీఆర్ఎస్ 39, బీజేపీ(BJP) 8, మజ్లిస్‌కు ఏడుగురు సభ్యుల బలం ఉంది. నిర్ణీత 39.6 శాతం ఓట్ల ప్రకారం కాంగ్రెస్‌కు ఒక స్థానం గెలిచే ఓట్లతో పాటు అదనంగా మరో 25 ఎక్కువ ఓట్లు ఉన్నందున అది రెండు స్థానాలకు పోటీ చేసే వీలుంది. బీఆర్ఎస్కు ఒక స్థానం గెలిచిన తర్వాత అదనంగా మరో ఆరు ఓట్లే ఉన్నందున అది రెండో స్థానానికి పోటీ చేసే వీలు ఉండదు.
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు, ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పొంతనలేదు : కడియం శ్రీహరి
తెలంగాణ జలాలు తీసుకెళ్దామనుకున్న స్వార్థ శక్తులకు ఈ సభ ఓ హెచ్చరిక : కేసీఆర్