BRS Chief KCR Crops Inspection 2024 : సాగు నీరు అందక ఎండుతున్న పంటలను పరిశీలించేందుకు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఆదివారం క్షేత్రస్థాయిలో (KCR Visit 3 Districts) పర్యటించనున్నారు. ఎండిపోయిన పంటల పరిశీలన నిమిత్తం జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. ఉదయం ఎర్రవెల్లి నుంచి బయల్దేరి, 10.30 గంటలకు జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధారావత్ తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు.
అనంతరం ఉదయం 11.30 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట గ్రామీణ మండలాల్లో పర్యటించి పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ మీడియా సమావేశం(KCR Press Meet) నిర్వహిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలంలో ఎండిన పంటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటారు. మూడు జిల్లాల పర్యటన అనంతరం కేసీఆర్ రాత్రికి తిరిగి ఎర్రవెల్లి చేరుకుంటారు.
కాంగ్రెస్ పాలన చూస్తే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది: కేసీఆర్
Lok Sabha Election 2024 : దాదాపు నెల రోజుల తర్వాత బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. అంతకు ముందు నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్ ఆ తర్వాత ఇంటికే పరిమితం అయ్యారు. ఇంటి వద్ద నుంచే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ మారుతున్న నాయకులను తన ఇంటి వద్దకే పిలిపించుకుని మాట్లాడుతున్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే బీఆర్‌ఎస్ పరిస్థితి చాలా దారుణంగా మారింది. పార్టీలో ఉన్న సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని విడిచి కాంగ్రెస్, బీజేపీల్లో చేరుతున్నారు. ఈ క్రమంలో కవిత అరెస్టు (MLC Kavitha Arrest) కూడా బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారింది. అలాగే ముఖ్యంగా పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న సీనియర్ నేత కేశవరావు, కడియం లాంటి వాళ్లు పార్టీని విడిచి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.
బీఆర్‌ఎస్‌ను వీడుతున్న సీనియర్ నేతలు : వీరితో పాటు బీఆర్‌ఎస్‌కు చెందిన చోటామోటా నేతలూ పార్టీని వీడుతుండటంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ క్రమంలో స్వయంగా అధినేత కేసీఆరే రంగంలోకి దిగుతున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మూడు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కేసీఆర్ పర్యటనతో నూతనోత్సాహం వస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు.
జనంలో ఉందాం, మళ్లీ పుంజుకుందాం - వలసల వేళ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం
'బీఆర్ఎస్‌లోనే ఉండండి - కానీ మాకోసం పనిచేయండి!' - కాంగ్రెస్ ఖతర్నాక్ ప్లాన్