ETV Bharat / politics

'బీఆర్ఎస్​ కార్యకర్తలే మంత్రి సురేఖపై ట్రోలింగ్​ చేశారు - సంస్కారహీనంగా ఆ పార్టీ సోషల్​ మీడియా పోస్టులు' - raghunandan rao on Minister Trolls - RAGHUNANDAN RAO ON MINISTER TROLLS

Raghunandan Rao about Trolls on Konda Surekha : తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం తెలియకుండా బీఆర్​ఎస్​ సోషల్​ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టిందని ఎంపీ రఘనందన్​రావు ధ్వజమెత్తారు. మంత్రి కొండా సురేఖపై సామాజిక మాధ్యమాల్లో చేసిన ట్రోలింగ్​పై స్పందించిన ఆయన, బీఆర్​ఎస్​ కార్యకర్తలే ట్రోలింగ్​ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల మీద బీఆర్‌ఎస్‌కు గౌరవం లేదని విమర్శించారు. మంత్రికి జరిగిన అవమానానికి తీవ్రవిచారం వ్యక్తం చేశారు.

MP Raghunandan Rao about Minister Konda Surekha Trolls
Raghunandan Rao about Trolls on Konda Surekha (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2024, 7:24 PM IST

Updated : Oct 1, 2024, 7:51 PM IST

MP Raghunandan Rao about Minister Konda Surekha Trolls : బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాకు తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం తెలియకుండా సంస్కారహీనంగా పోస్టులు పెట్టిందని బీజేపీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావు మండిపడ్డారు. ఇవాళ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఇన్​ఛార్జి మంత్రిగా కొండా సురేఖ తొలిసారి దుబ్బాకకు కల్యాణ్‌ లక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీకి వచ్చినందుకు ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేసినట్లు చెప్పారు. అలాంటి నూలు పోగు దండను ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా వేశానని గుర్తు చేశారు.

అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని రఘునందన్‌ రావు అన్నారు. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. పోస్టు పెట్టిన అకౌంట్​కు హరీశ్​రావు, కేసీఆర్‌ ఫోటో ఉందన్నారు. బీఆర్‌ఎస్‌కు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదని విమర్శించారు. పోస్టులు పెట్టిన వారు మీ వాళ్లు అయితే తీసుకొచ్చి పోలీసులకు అప్పగించండని డిమాండ్‌ చేశారు. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే వచ్చి మీరు కూడా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని మాజీమంత్రులు కేటీఆర్​, హరీశ్​రావును ఉదేశిస్తూ అన్నారు.

'గతంలో ప్రధాని నరేంద్రమోదీకి కూడా నూలు పోగు దండ వేశాను. అలానే ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశాను. కానీ కొందరు అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం తెలియకుండా సంస్కారహీనంగా పోస్టులు పెట్టారు. బీఆర్​ఎస్​ పార్టీ గుర్తు ఉన్న ఫొటో, హరీశ్​రావు, కేటీఆర్​ ఫొటోలున్న అకౌంట్​ నుంచి ఈ పోస్టులు పెట్టారు. వెంటనే కేటీఆర్​, హరీశ్​రావు స్పందించి చర్యలు తీసుకోవాలి'- రఘునందన్‌ రావు, బీజేపీ మెదక్‌ ఎంపీ

కేటీఆర్, హరీశ్​రావు క్షమాపణ చెప్పాలి : కేటీఆర్, హరీశ్​రావు దీనిపై స్పందించి సోషల్ మీడియాను కంట్రోల్ చేసుకుని క్షమాపణ చెప్పాలని రఘునందన్‌ రావు డిమాండ్​ చేశారు. వ్యక్తుల వ్యక్తిత్వ హననం చేయడం మంచిది కాదని సూచించారు. మహిళల మీద బీఆర్‌ఎస్‌కు గౌరవం లేదన్నారు. తెలంగాణ తొలి కేబినెట్​లో మహిళలకు చోటు ఇవ్వలేదని గుర్తు చేశారు. బీఆర్​ఎస్​ పార్టీ నుంచే డబ్బుల తీసుకున్న వారు ఇలాంటి ట్రోలింగ్​ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ కార్యకర్తలే ట్రోలింగ్​ చేశారని ఆరోపించారు.

కవిత పట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్​ సమర్థిస్తారా : మంత్రి సురేఖ - Surekha Fires on brs social media

కేటీఆర్ కాన్వాయ్​ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు - Congress Leaders Blocked KTR Convoy

Last Updated : Oct 1, 2024, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.