ETV Bharat / politics

కమలం కంచుకోట పదిలం - సిట్టింగ్​ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం - BJP WINS SITTING MP SEATS IN TELANGANA 2024 - BJP WINS SITTING MP SEATS IN TELANGANA 2024

BJP Won in Sitting MP Positions : రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ, లోక్​సభ ఫలితాల్లోనూ అలాంటి ఫలితాలనే నమోదు చేసింది. కాంగ్రెస్​ పార్టీకి దీటుగా 8 చోట్ల జయకేతనం ఎగురవేసింది. సిట్టింగ్​ ఎంపీ అభ్యర్థులు మరోసారి గెలిచి, తమ కంచుకోటను మరింత పదిలం చేసుకున్నారు.

TELANGANA LOK SABHA ELECTION RESULTS 2024
TELANGANA LOK SABHA ELECTIONS 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 3:59 PM IST

Updated : Jun 4, 2024, 10:55 PM IST

BJP Candidates Won in Sitting MP Positions in Telangana : తెలంగాణ లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. గతంలో సాధించిన సీట్ల సంఖ్యను ఈసారి రెట్టింపు చేసుకుంది. ముఖ్యంగా తమ కంచుకోటల్లో సిట్టింగ్​ అభ్యర్థులు మరోసారి విజయదుందుభి మోగించారు. సికింద్రాబాద్​లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​రెడ్డి, కరీంనగర్​లో బండి సంజయ్​, నిజామాబాద్​ స్థానం నుంచి ధర్మపురి అర్వింద్ వరుసగా రెండోసారి గెలుపొందగా​, ఆదిలాబాద్​ స్థానం నుంచి తొలిసారి బరిలోకి దిగిన గోడం నగేశ్ 78 వేలకు పైగా మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు.​

సికింద్రాబాద్‌ కా సికిందర్ కిషన్ రెడ్డి : సికింద్రాబాద్​ పార్లమెంట్​ స్థానాన్ని బీజేపీ మరోసారి నిలబెట్టుకుంది. ఇక్కడి నుంచి పోటీ చేసిన కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి, సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్​ అభ్యర్థి దానం నాగేందర్​పై 52 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు​. కాగా బీఆర్​ఎస్​ స్థానం నుంచి పోటీ ఇచ్చిన పద్మారావు గౌడ్ మూడోస్థానంలో​ నిలిచారు. నియోజకవర్గంలో కిషన్​రెడ్డికి ఇది వరుసగా రెండో గెలుపు కావడంతో పార్టీ శ్రేణులు సంబురాలు జరిపారు.

కరీంనగర్​లో రెండోసారి కమల వికాసం : రాష్ట్రంలో మరో కంచుకోట కరీంనగర్ నియోజకవర్గం. ఇది మళ్లీ బీజేపీ ఖాతాలోకే చేరింది. సిట్టింగ్ స్థానమైన కరీంనగర్​ లోక్​సభ నియోజకవర్గ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ తన స్థానాన్ని సుస్థిరపరచుకున్నారు. రెండో గెలుపుతో కమలం వికసించటమే కాకుండా, 2.12 లక్షల భారీ మెజారీటీని నమోదు చేశారు. కాగా ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున వెలిచాల రాజేందర్​రావు, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్​కుమార్ పోటీలో నిలిచారు.

సిట్టింగ్​కే పట్టం - ధర్మపురి విజయం : నిజామాబాద్​ లోక్​సభ స్థానం నుంచి కాషాయం జయకేతనం ఎగురవేసింది. కమలం పార్టీ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ 1.13 లక్షల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి జీవన్​రెడ్డిపై భారీ మెజార్టీతో గెలిచారు. ఇందూరు స్థానం నుంచి ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్​ మధ్య పోటీ నెలకొనగా, జాతీయపార్టీల మధ్యనే హోరాహోరీగా సాగింది.

అభ్యర్థి మారినా ఆదిలాబాద్​ కమలానిదే : ఆదిలాబాద్​లో బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్​ 78 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా ఎన్నో సవాళ్ల మధ్య నిలబెట్టిన ఈ స్థానం కాషాయం ఖాతాలో పదిలమైంది. సిట్టింగ్​ ఎంపీ సోయం బాపురావును కాదని, మాజీ ఎంపీ రమేశ్​ రాఠోడ్ సహా ఇటీవల గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడంతో ఆదిలాబాద్​ స్థానం బీజేపీకి సవాల్​గా మారింది. దీంతో అగ్రనేతలు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలు పెట్టి ప్రజల ఆకర్షించి అభ్యర్థి గెలుపు దిశగా పునాదులు వేశారు. కాగా సమీప కాంగ్రెస్​ అభ్యర్థి ఆత్రం సునీతపై 78 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

అసెంబ్లీ పోరులో ఓడించినా - లోక్​సభ వార్​లో గెలిపించారు - తెలంగాణ ప్రజల విలక్షణ తీర్పు - BJP wins telangana elections 2024

అసెంబ్లీ - లోక్​సభ ఫలితాల్లో సేమ్ టు​ సేమ్​ - 8 స్థానాలు కైవసం చేసుకున్న కాషాయదళం - Telangana Loksabha Elections 2024

Last Updated : Jun 4, 2024, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.