Bandi Sanjay on MLC Kavitha : సీబీఐ, ఈడీ అనేవి స్వతంత్ర విచారణ సంస్థలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎపీ బండి సంజయ్ అన్నారు. సీబీఐ సేకరించిన ఆధారాలు, సాక్ష్యాల మేరకు కవితకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఆధారాలుంటే ఎంత పెద్దవారైనా ఉపేక్షించకూడదనేదే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.
Bandi Sanjay Comments on Congress : కాంగ్రెస్, భారత్ రాష్ట్ర సమితి మధ్య చీకటి ఒప్పందం నడుస్తోందని బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. గతంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేసిన చరిత్ర వారిదని విమర్శించారు. ఆ రెండు పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆక్షేపించారు. గత ఎన్నికల్లోనూ ఇలాగే ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూశారని ధ్వజమెత్తారు. వారం రోజుల్లో లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. గులాబీ పార్టీతో తమకు పొత్తు అనేదే ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితం కాబోతోందని బండి సంజయ్ జోస్యం చెప్పారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయండి : బండి సంజయ్
Bandi Sanjay Fires on BRS : కరీంనగర్ నియోజకవర్గానికి వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. కొండగట్టు, వేములవాడ ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధుల కొరత ఏర్పడితే కేంద్రం నుంచి తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా కొండగట్టు, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని బండి సంజయ్ వెల్లడించారు.
రాష్ట్రానికి వచ్చిన కేంద్ర నిధులను వివరించడానికే జనహిత యాత్ర: బండి సంజయ్
తెలంగాణలో విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని జోస్యం చెప్పారు. దేశంలో రామరాజ్య పరిపాలన కొనసాగాలని, మోదీ పరిపాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ఈసారి 370 లోక్‌సభ (Lok Sabha Elections)సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండో విడత ప్రజాహిత యాత్రను ప్రారంభిస్తానని వెల్లడిచారు. తొలిదశ యాత్రకు అపూర్వ స్పందన లభించిందని, కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.
"దేశంలో రామరాజ్య పరిపాలన కొనసాగాలి. మోదీ పరిపాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 370 లోక్‌సభ సీట్లు సాధిస్తాం. విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అద్భుత స్పందన. సీబీఐ, ఈడీ అనేవి స్వతంత్ర విచారణ సంస్థలు. సీబీఐ సేకరించిన ఆధారాలు, సాక్ష్యాల మేరకు కవితకు నోటీసులు. ఆధారాలుంటే ఎంత పెద్దవారైనా ఉపేక్షించకూడదనేదే బీజేపీ విధానం." - బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ
అమరులను మరిచిన బీఆర్ఎస్‌కు ప్రజలు సరైన బుద్ధిచెప్పారు : బండి సంజయ్
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయం : బండి సంజయ్