ETV Bharat / politics

అమరులను మరిచిన బీఆర్ఎస్‌కు ప్రజలు సరైన బుద్ధిచెప్పారు : బండి సంజయ్ - BJP vijaya sankalpa yatra

Bandi Sanjay fires on BRS : అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేసిందని, అందుకే రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని మరుగున పడేశారని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ పేర్కొన్నారు. విజయ సంకల్పయాత్రలో భాగంగా బండి సంజయ్ నిర్మల్‌ జిల్లాలోని వేయి ఉరులమర్రి ప్రాంతాన్ని సందర్శించారు. వచ్చే సంవత్సరం నాటికి అక్కడ అమరవీరుల స్మారక స్తూపంతో పాటు, స్మృతి వనాన్ని నిర్మిస్తామని తెలిపారు.

BJP Vijaya Sankalpa Yatra in Nirmal
Bandi Sanjay fires on BRS
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 5:33 PM IST

అమరులను మరిచిన బీఆర్ఎస్‌కు ప్రజలు సరైన బుద్ధిచెప్పారు బండి సంజయ్

Bandi Sanjay fires on BRS : ప్రధాని నరేంద్ర మోదీని(PM MODI) మూడోసారి ప్రధానమంత్రి చేయాలనే సంకల్పంతో, రాష్ట్రవ్యాప్తంగా విజయ సంకల్పయాత్రలకు శ్రీకారం చుట్టినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. ఇవాళ బీజేపీ విజయ సంకల్పయాత్రలో భాగంగా నిర్మల్‌ జిల్లాలోని వేయి ఉరులమర్రి ప్రాంతాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు.

BJP Vijaya Sankalpa Yatra in Nirmal : ఈ సందర్భంగా బండి సంజయ్‌(Bandi Sanjay) మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ, ప్రజలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా విజయ సంకల్పయాత్ర కొనసాగుతుందన్నారు. అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేసిందని, అందుకే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని మరుగున పడేశారన్నారు. వెయ్యి ఉరులమర్రి చరిత్రను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తన పాదయాత్రలో భాగంగా సమాజానికి తెలియజేశారని గుర్తుచేశారు.

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయం : బండి సంజయ్​

Bandi Sanjay in Vijaya Sankalpa Yatra : తెలంగాణ వీరుల చరిత్రను ప్రజలకు తెలియకూడదనుకున్న బీఆర్ఎస్(BRS) ప్రభుత్వానికి, ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. వేయి ఉరులమర్రి స్థానంలో ఎలాంటి కట్టడం లేదని, ఓట్ల రాజకీయాల కోసం ఇక్కడ ఒక వర్గానికి అనుకూలంగా సమాధి ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. వచ్చే సంవత్సరం నాటికి ఇక్కడ అమరవీరుల స్మారక స్తూపంతో పాటు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.

స్మృతి వనం ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం, అధికారులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం ఎటువంటి కులమతాలకు సంబంధం లేదని, దీనిని ఎవరైనా వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వెయ్యి మంది వీరులను ఎక్కడ ఉరితీశారో అక్కడే స్మృతి వనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీ సోయం బాపురావు, తదితరులు పాల్గొన్నారు.

"అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగున పడేసింది. అందుకే రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని మరుగున పడేశారు. నిర్మల్‌ జిల్లాలోని వేయి ఉరులమర్రి ప్రాంతంలో స్మృతి వనం ఏర్పాటును గత ప్రభుత్వం విస్మరించింది. వచ్చే సంవత్సరం నాటికి ఇక్కడ అమరవీరుల స్మారక స్తూపంతో పాటు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తాము. స్మృతి వనం ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం, అధికారులు సహకరించాలి". - బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

17 పార్లమెంట్‌ నియోజకవర్గాలు - 5,500 కిలోమీటర్లు - 12 రోజులు - బీజేపీ రథయాత్ర నేడే ప్రారంభం

కాంగ్రెస్​లో చేరుతున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఈటల​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.