ETV Bharat / politics

దేశ రాజకీయాలనే శాసించిన 'మిస్టర్​ నాయుడు' - చంద్రబాబు విజనరీ లీడర్​ : అర్నాబ్​ గోస్వామి - Arnab Goswami Comments on CBN

Arnab Goswami Comments on TDP Chief Chandrababu Naidu : దేశ రాజకీయాల్లో తృతీయ కూటమిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రధానమంత్రి, రాష్ట్రపతి అభ్యర్థులను నిర్ణయించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రధానమంత్రి పదవివి అలంకరించే అవకాశాలున్నా, సున్నితంగా తిరస్కరించి ఎన్​డీఏ కూటమి జాతీయ కన్వీనర్​గానూ విజయవంతమైన పాత్ర పోషించారు. 'మిస్టర్​ నాయుడు'గా జాతీయ మీడియా పిలుచుకొనే చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్​ గోస్వామి ఏమన్నారంటే?

Arnab Goswami Comments on TDP Chief
Arnab Goswami Comments on TDP Chief Chandrababu Naidu
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 3:10 PM IST

Updated : Mar 9, 2024, 3:21 PM IST

Arnab Goswami Comments on TDP Chief Chandrababu Naidu : చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్​. రాజకీయాల్లో ఆయన లెజెండ్. ప్రత్యర్థులు​ సైతం గౌరవించే అరుదైన నాయకుడు అని ప్రముఖ జర్నలిస్టు అర్నాబ్​ గోస్వామి కొనియాడారు. దేశ రాజకీయాలపై చర్చ సందర్భంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్​గా మారాయి. ఇప్పుడు దీనిపై చర్చ నడుస్తోంది.

రాజకీయ పాత్రికేయుడిగా తన అనుభవాన్ని గుర్తు చేసుకున్న అర్నాబ్ గోస్వామి, దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిన సమయంలో తాను మైక్​ పట్టుకొని ఆయన వెంట పరిగెత్తానని చెప్పారు. చంద్రబాబు నాయుడు దేశానికి ఈ-గవర్నెన్స్ (E Governance) పరిచయం చేశారని, డిజిటలైజేషన్ (Digitization) ​కు ఆద్యుడని పేర్కొన్నారు. విజనరీ నాయకుడు అని చెపుతూ నాయుడు సూచించిన వ్యక్తులే అప్పట్లో ప్రధానమంత్రులు, రాష్ట్రపతిగానూ నియమితులయ్యారని వెల్లడించారు. తాను అంత తేలిగ్గా ఎవరికీ పొగడ్తలు ఇచ్చేవాడిని కాదని అర్నాబ్​ అన్నారు. రాజకీయ నాయకుడిగా చంద్రబాబు పట్ల ప్రజలకు చాలా గౌరవం ఉందని తెలిపారు. ప్రత్యర్థులు సైతం ఆయనను గౌరవిస్తారని పేర్కొన్నారు.

ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ - సీట్ల సర్దుబాటుపై కుదిరిన అవగాహన

దేశ రాజకీయాల్లే శాసించిన మిస్టర్​ నాయుడు : జాతీయ మీడియా 'మిస్టర్​ నాయుడు'గా పిలుచుకొనే చంద్రబాబు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1995లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు అనతి కాలంలోనే దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది. ఆ క్రమంలోనే ప్రధానమంత్రి అభ్యర్థులను ఎంపిక చేసిన చంద్రబాబు ‘కింగ్‌ మేకర్‌’గా మారారు. అప్పట్లో కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టిన చంద్రబాబు, దేశ రాజకీయాల్లోనే తొలిసారి తృతీయ ఫ్రంట్​(Third Front) నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడంలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో చంద్రబాబు సహకారంతో దేవెగౌడ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బయట నుంచి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పట్టుబట్టడంతో తుదకు ఐకే గుజ్రాల్​ ప్రధాని అయ్యారు. థర్డ్ ఫ్రంట్​ జాతీయ కన్వీనర్‌గా వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడంలో చంద్రబాబు విజయవంతమయ్యారు.

ఎన్డీఏలోకి చంద్రబాబు - ఏపీలో టీడీపీ, జనసేన కూటమితో జట్టుకట్టిన బీజేపీ!

ఇక 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ ఘన విజయాన్ని దక్కించుకుంది. రాష్ట్ర శాసన సభలో 294 సీట్లకు గాను 185 సీట్లు సాధించింది. 29 ఎంపీ సీట్లు గెలుచుకున్న టీడీపీ-బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్​డీఏ(NDA) సంకీర్ణ ప్రభుత్వంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2004 వరకూ ఎన్డీఏ కూటమికి చంద్రబాబు కన్వీనర్‌గా వ్యవహరించగా ఆ సమయంలో మోదీ గుజరాత్​ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాష్ట్రపతి స్థానంలో దళితవర్గానికి చెందిన నారాయణన్‌ ఎంపికలోనూ చొరవ తీసుకున్న చంద్రబాబు ఆయన అనంతరం అబ్దుల్‌ కలాం పేరును ప్రతిపాదించారు.

ఈ నెల 17న టీడీపీ-జనసేన మేనిఫెస్టో - ఏపీ భవిత కోసమే అంటూ నేతల వెల్లడి

Last Updated : Mar 9, 2024, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.