ETV Bharat / politics

పసుపుబోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్​లోనే పెడతాం : అమిత్​షా - Amit Shah Campaign in Telangana - AMIT SHAH CAMPAIGN IN TELANGANA

Amit Shah Fires on Congress Party : గతంలో బీఆర్ఎస్ అవినీతి చేసేదని, ఇప్పుడు కాంగ్రెస్‌ చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా ఆరోపించారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిర్పూర్​ కాగజ్​నగర్, నిజామాబాద్​ సభకు హాజరైన కేంద్రమంత్రి, ఆదిలాబాద్​ లోక్​సభ అభ్యర్థి గోడెం నగేశ్, నిజామాబాద్​ ఎంపీ అభ్యర్ధి అర్వింద్​​కు మద్ధతుగా ప్రచారం నిర్విహించారు. ఈక్రమంలోనే హస్తం పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, తనపై ఓ ఫేక్‌ వీడియోను కాంగ్రెస్‌ వైరల్‌ చేసిందని షా మండిపడ్డారు.

Lok Sabha Elections 2024
Amit Shah Comments on Congress and BRS (ETV BHARAT)
author img

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 5:47 PM IST

Updated : May 5, 2024, 7:48 PM IST

Amit Shah Comments on Congress and BRS : రాష్ట్రంలో వరుస పర్యటనలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్​లోని కాగజ్​నగర్​లో ఏర్పాటు చేసిన బీజేపీ జనసభకు హాజరైన ఆయన, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రంలో కమలం పార్టీ అధికారంలోకి మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ఓ ఫేక్‌ వీడియోను కాంగ్రెస్‌ వైరల్‌ చేసిందని మండిపడ్డ షా, ఆ ఫేక్‌ వీడియోను సీఎం రేవంత్‌ రెడ్డి కూడా సర్క్యులేట్‌ చేశారని తప్పుబట్టారు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే, రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదంటూ అమిత్‌ షా స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కమలం పార్టీ కాపాడుతుందని, ఆయన పేర్కొన్నారు. 70 ఏళ్లుగా అయోధ్య రామమందిరం నిర్మాణం జరగకుండా కాంగ్రెస్‌ అడ్డుకుందన్న అమిత్‌ షా, రెండోసారి ప్రధానిగా మోదీ వచ్చాకే రామమందిర ప్రతిష్ఠ జరిగిందన్నారు.

"కాంగ్రెస్‌ పార్టీ అబద్దాలను నమ్ముకొని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. బీజేపీ అధికారంలోకి మళ్లీ వస్తే, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను మాట్లాడినట్లు ఓ ఫేక్‌ వీడియోను కాంగ్రెస్‌ సర్క్యులేట్‌ చేసింది. ఆ వీడియోను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఫార్వార్డ్​ చేశారు. దీన్ని నేను ఖండిస్తున్నా అలానే తెలంగాణ దళిత, ఓబీసీ ప్రజలకు నేను ఒకటే చెబుతున్నా, బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తేలేదు."-అమిత్​షా, కేంద్ర హోంశాఖ మంత్రి

గతంలో బీఆర్ఎస్ అవినీతి చేసేది - ఇప్పుడు కాంగ్రెస్‌ చేస్తోంది : అమిత్​షా (ETV BHARAT)

ఓవైసీ అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండింటికీ భయమే : కాంగ్రెస్​ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్‌ ఇద్దరినీ రామమందిర ప్రతిష్ఠకు ఆహ్వానించినా, తమ ఓటు బ్యాంకు పోతుందని ఇద్దరూ రాలేదని గుర్తు చేశారు. ఖర్గే, రాహుల్‌ ఓటు బ్యాంకు, ఓవైసీ ఓటు బ్యాంకు ఒకటే అంటూ అమిత్‌ షా వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్​ఎస్ అవినీతి చేసేదని, ఇప్పుడు కాంగ్రెస్‌ చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే పార్లమెంట్​ ఎన్నికల్లో రెండు విడతల పోలింగ్‌ ముగిసిందని, తొలి రెండు విడతల్లో కమలం పార్టీ సెంచరీ కొడుతుందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో కొన్నాళ్లుగా బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతోందని, ఈసారి రాష్ట్రంలో పది ఎంపీ సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పండుగలను కూడా సైనికుల మధ్య జరుపుకొనే మోదీ ఓ వైపు, సెలవుల కోసం బ్యాంకాక్‌ టూర్లు వేసే రాహుల్‌ బాబా మరో వైపు ఉన్నారని వ్యాఖ్యానించారు. తాను ఎక్కడకు వెళ్లినా ‘మోదీ, మోదీ’ నినాదాలే వినిపిస్తున్నాయని, కేంద్రంలో మరోసారి మోదీ సర్కారు రావటం పక్కా అని అమిత్​ షా అన్నారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్​కు వేసే ఓటు నరేంద్రమోదీకి వేసేదే అని అన్నారు.

ఏబీసీ అంటే అసదుద్దీన్‌, బీఆర్ఎస్, కాంగ్రెస్ : మరోవైపు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు మద్దతుగా అమిత్‌షా ప్రచారం నిర్వహించారు. అర్వింద్‌ను గెలిపిస్తే, బీడీ కార్మికులకు ఆసుపత్రి కట్టిస్తామని, చక్కెర పరిశ్రమలు తెరిపిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా పసుపుబోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్‌లోనే పెడతామని తెలిపారు. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకుందని దుయ్యబట్టారు. రాహుల్, రేవంత్ పేరుతో ఆర్ఆర్ టాక్స్ వేసి, దిల్లీకి తరలిస్తున్నారని షా ఆరోపించారు. ఏబీసీ అంటే అసదుద్దీన్‌ ఒవైసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.

"ఇక్కడ పసుపు పంట చాలా ఎక్కువగా పండుతుంది. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ వెంటపడి మరీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సాధించారు. అర్వింద్​ను​ రెండోసారి ఎంపీగా గెలిపిస్తే, పసుపుబోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్​లోనే పెడతాం. అలానే బీడీ కార్మికుల కోసం ఆసుపత్రి కట్టిస్తాం."-అమిత్​షా, కేంద్ర హోంశాఖ మంత్రి

పసుపుబోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్‌లోనే పెడతాం: అమిత్‌షా (ETV BHARAT)

అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసు - సీఎంకు నాలుగు వారాలు గడువు కోరిన పీసీసీ లీగల్​ సెల్​ - Amit Shah Fake Video Case

'బీజేపీకి 400 సీట్లు పక్కా! ఓటమి భయంతో ప్రతిపక్షాలు'- ఈటీవీ భారత్​తో అమిత్ షా ఎక్స్​క్లూజివ్​ - lok sabha election 2024

Last Updated : May 5, 2024, 7:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.