అమెరికాలో హెలీన్ తుపాన్ విధ్వంసం- ఫ్లోరిడాలో భారీ వరదలు- 10లక్షల ఇళ్లకు కరెంట్ కట్! - Helene Turns Cat 1 Hurricane US - HELENE TURNS CAT 1 HURRICANE US

Helene Hurricane US : మెక్సికోని వణికించిన హెలీన్ తుపాను అమెరికాలో విధ్వంసం సృష్టిస్తోంది. అతితీవ్ర తుపానుగా మారి భారీ వరదలతో ఫ్లోరిడా రాష్ట్రాన్ని ముంచెత్తింది. గంటకు 225కిలో మీటర్ల వేగంతో వీస్తున్న పెనుగాలులతో సముద్రం 6మీటర్ల ఎత్తున ఎగిసిపడే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ విభాగం హెచ్చరించింది. ఫ్లోరిడా, జార్జియా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో తుపాను ధాటికి ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది.
(Associated Press)

Published : Sep 27, 2024, 5:09 PM IST