Caste Census in Telangana : రాష్ట్రంలోరాబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. సమగ్ర జనగణన, బీసీ కులగణన చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది? మరి ఈ నేపథ్యంలో అసలు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాలు ఇదివరకు ఎలాంటి పద్ధతుల్లో జనగణన నిర్వహించాయి? బీసీ కులగణన తర్వాత రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు పెంచుకోవడానికి మార్గం సుగమం అవుతుందా? రిజర్వేషన్లు పెంచుకోవడంపై కోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి?
రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక తయారు చేస్తోంది? కులగణన చేపట్టేందుకు, బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏంటి? జనగణన నిర్వహించడం కోసం కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలంటే ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో గతంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ఎలాంటి పద్ధతి అనుసరించారు? ఇప్పుడు స్థానిక ఎన్నికలు సాఫీగా జరపాలంటే రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన అమలుచేయాలి?
దేశవ్యాప్తంగా ఇతరరాష్ట్రాలు బీసీ రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తున్నాయి? మన రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లను పెంచుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? సకాలంలో బీసీ కులగణన చేపట్టకపోతే రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికలు, పరిపాలన, కేంద్ర నిధుల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి? 1994 నుంచి ఉమ్మడిరాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 34శాతం అమలయ్యాయి కదా, తర్వాత ఎందుకు 24%కి పడిపోయాయి? ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నప్పడు, బీసీలకు ఎందుకు కావట్లేదు?
ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేసే అవకాశం ఉందా? లేక 24 శాతాన్నే అమలు చేస్తారా? రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు, పలురాష్ట్రాల హైకోర్టులు ఇప్పటికే కొన్నితీర్పులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కులగణన తర్వాతైనా బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు దక్కే అవకాశం ఉంటుందా? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని.