Prathidhwani on Flood Victims in Telugu States : తెలుగు రాష్ట్రాలకు తీరని గుండెకోత మిగిల్చాయి ఇటీవలి వాయుగుండంతో ముంచెత్తిన వరదలు. ఎటుచూసినా వరద ప్రవాహాలు మిగిల్చిన కష్టం, ఆ కారణంగా కలిగిన అపారనష్టమే కనిపిస్తోంది. ఉభయరాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో రైతుల కష్టం నీటి పాలయ్యింది. కొన్నిచోట్ల పంట పొలాలు నామరూపాల్లేకుండా విధ్వంసానికి గురయ్యాయి. చెరువులు తెగిపోయాయి. వాగులు గండ్లు పడ్డాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న పంటలు సర్వనాశనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకునేదెలా అన్నదే రెండు రాష్ట్ర ప్రభుత్వాల ముందు సవాల్‌గా మారింది. ఇదే సమయంలో నష్టం అంచనాలకు కేంద్రబృందం తరలిరావడం చిమ్మచీకట్లలో చిరుదీపంలా ఆశలు కలిగిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో వరదప్రభావిత ప్రాంతాలకు కేంద్రం నుంచి ఎలాంటి ఆపన్నహస్తం అందిస్తే రైతులు కాస్తయినా కోలుకునే అవకాశం ఉంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తిన వరదలు కష్టాలు - కేంద్రంపైనే భారం - Prathidhwani on Flood Victims - PRATHIDHWANI ON FLOOD VICTIMS
Debate on Flood Victims : ఇటీవల వాయుగుండం వల్ల ముంచెత్తిన వరదలు తెలుగు రాష్ట్రాలకు తీరని అపార నష్టాన్ని కలిగించింది. ప్రస్తుతం కేంద్రబృందం పర్యటిస్తున్న నేపథ్యంలో చిమ్మచీకట్లలో చిరుదీపంలా ఆశలు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వరద బాధితులకు, పంట నష్టపోయిన రైతులకు కేంద్ర, రాష్ట్రాల నుంచి ఎలాంటి సాయం అందుతుంది? వారి నుంచి సాయం ఏ స్థాయిలో ఉంటే రైతులు కోలుకునే ఆవకాశం ఉంది? ఇదే నేటి ప్రతిధ్వని.

Published : Sep 13, 2024, 11:32 AM IST