Prathidhwani on Cyber Crime Cases : కష్టపడి సంపాదించడమే కాదు ఆ కష్టార్జితాన్ని భద్రంగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే. కానీ ఆ మాటే మిథ్య అవుతోంది సైబర్ నేరాల ఉద్ధృతిలో. వందల నుంచి వేల కోట్ల రూపాయలకు చేరుతున్న సైబర్ మోసాల్లో ప్రజల జేబులు గుల్లగుల్ల అవుతున్నాయి. కేవైసీ పేరిట మోసాలు మొదలు డిజిటల్ అరెస్టులతో దడ పుట్టించడం వరకు చెలరేగిపోతున్నారు సైబర్ నేరస్థులు. గంటల వ్యవధిలో జీవితాలను రోడ్ల మీదకు తెచ్చేస్తున్నారు. కొన్నిసార్లు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల్ని సైతం ఆశ్చర్యపరిచేలా ఉంటున్నాయి ఈ నేరాలు. సామాన్యులే కాదు, ఉన్నత చదువులు చదువుకున్న వారు ఐటీ ఉద్యోగులూ వీరిలో బాధితుల్లో ఉండడమే విస్తుపోయేలా చేస్తోంది. మరి ఈ మోసాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
సరికొత్త మార్గాల్లో దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు - దడ పుట్టించేలా నేరాలు - Prathidhwani on Cyber Crime - PRATHIDHWANI ON CYBER CRIME
Debate on Cyber Fraud : దేశవ్యాప్తంగా రోజురోజుకీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సరికొత్త మార్గాల్లో అందినంత దోచేస్తున్నారు. వివిధ రకాలుగా మోసానికి పాల్పడుతూ వందల నుంచి వేల కోట్ల రూపాయలు కాజేస్తున్నారు. మరి వాటి బారిన పడిన ప్రజలు ఎన్నిరకాలుగా నష్టపోతున్నారు? వీటి విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? ఇదే నేటి ప్రతిధ్వని.
Published : Sep 28, 2024, 11:43 AM IST