ETV Bharat / offbeat

చూస్తేనే నోరూరిపోయే "వంకాయ పచ్చడి" - ఈ కొలతలతో చేసుకున్నారంటే అద్భుతః అనాల్సిందే! - VANKAYA PACHADI RECIPE

ఈ కొలతలతో వంకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ సూపర్​గా ఉంటుంది!

How to Make VANKAYA PACHADI
Vankaya Pachadi Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2024, 6:49 PM IST

Vankaya Pachadi Recipe in Telugu : వంకాయ.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోరూరిపోతుంది. అయితే, మీరు ఇప్పటివరకు వంకాయలతో రకరకాల రెసిపీలు ట్రై చేసి ఉంటారు. కానీ, ఓసారి ఈ కొలతలతో వంకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని చూడండి. పుల్లపుల్లగా, కారంకారంగా ఉండే ఈ పచ్చడిని వేడి వేడి అన్నం, చపాతీ, రోటీ.. ఇలా దేనిలోకి తిన్నా అద్భుతః అనాల్సిందే! అంత రుచికరంగా ఉంటుంది ఈ పచ్చడి. మరి, ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • వంకాయలు - 4
  • ఉప్పు - తగినంత
  • ఆయిల్ - 1 టేబుల్​స్పూన్
  • ధనియాలు - 1 టేబుల్​స్పూన్
  • జీలకర్ర - 1 టేబుల్​స్పూన్
  • ఎండుమిర్చి - 15
  • నూనె - తగినంత
  • పసుపు - అర టేబుల్​స్పూన్
  • టమాటాలు - 3
  • చింతపండు - నిమ్మకాయ సైజంత
  • వెల్లుల్లి రెబ్బలు - 8
  • ఉల్లిపాయ - 1

తాలింపు కోసం :

  • ఆయిల్ - 1 టేబుల్​స్పూన్
  • జీలకర్ర - 1 టేబుల్​స్పూన్
  • ఆవాలు - 1 టేబుల్​స్పూన్
  • శనగపప్పు - 1 టేబుల్​స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 8
  • ఎండుమిర్చి - 4
  • కరివేపాకు - కొద్దిగా

మిర్చి, ఎగ్​ బజ్జీలు తిని బోర్ కొడుతోందా? - వేడివేడి వంకాయ బజ్జీ ట్రై చేయండి

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో అరలీటర్ వాటర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి.
  • తర్వాత ఫ్రెష్​గా ఉండే లేత గుత్తొంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని బౌల్​లో తీసుకున్న ఉప్పు నీటిలో వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ధనియాలు, జీలకర్ర వేసుకొని కలుపుతూ కాసేపు వేయించుకోవాలి. ఆపై ఎండుమిర్చిని వేసుకొని బాగా వేయించుకున్నాక ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం అదే కడాయిలో మరో టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకుని ఉప్పు నీళ్లలో ఉంచిన వంకాయ ముక్కలను తీసుకొని వాటర్ లేకుండా వేసుకోవాలి. ఆపై వెంటనే అర టేబుల్​ స్పూన్ చొప్పు ఉప్పు, పసుపు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో ఇంకో టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత అందులో.. కాస్త పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కలతో పాటు చింతపండును విడదీసి వేసుకొని 3 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. టమాటా మెత్తగా ఉడికాయనుకున్నాక పాన్​ని దించి చల్లార్చుకోవాలి.

లఖ్​నవూ స్పెషల్​ "మలై గుత్తొంకాయ కుర్మా" - ఒక్కసారి టేస్ట్ చేశారంటే జిందగీ ​ఖుష్ అయిపోతుంది!

  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని ముందుగా అందులో ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకొని కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత దానిలో రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఉడికించుకున్న టమాటా మిశ్రమం వేసుకొని ఒకసారి కలిపి పేస్ట్​లా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆపై ఒకసారి ఆ మిశ్రమాన్ని కలుపుకొని వేయించుకుని పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇక చివరగా అందులో పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అవి మరీ మెత్తగా అవ్వకుండా పంటికి తగిలేలా ఒకసారి జస్ట్ అలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. ఈ పచ్చడిని మిక్సీలో కంటే రోట్లో పైన చెప్పిన విధంగా ఒక్కొక్కటి వేసుకుంటూ రుబ్బుకుంటే ఇంకా చాలా రుచికరంగా వస్తుంది.
  • ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చిని తుంపి వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఆపై కరివేపాకు వేసుకొని చిటపటలాడనిచ్చి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం ఈ తాలింపుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి మొత్తం కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే "వంకాయ పచ్చడి" రెడీ!

గుత్తి వంకాయతో ఘుమఘమలాడే దమ్ బిర్యానీ - ఒక్కసారైనా తిని తీరాల్సిందే గురూ! - ఇలా ప్రిపేర్ చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.