ETV Bharat / offbeat

దోశలు క్రిస్పీగా రావడం లేదా? ఈ టిప్స్ పాటిస్తూ వేస్తే సూపర్​ క్రిస్పీతో పాటు టేస్ట్ అద్దిరిపోతాయి! - Crispy Dosa Making Tips - CRISPY DOSA MAKING TIPS

Crispy Dosa Making Tips: టిఫెన్స్​ లిస్ట్​లో 'దోశ' ముందు వరుసలో ఉంటుంది. అంతేకాదు.. ఎక్కువ మందికి ఇష్టమైన బ్రేక్​ఫాస్ట్ ఐటమ్ కూడా. అయితే, చాలా మందికి దోశలను క్రిస్పీగా వేసుకోవడం రాదు. అలాంటి వారికోసం కొన్ని ఈజీ టిప్స్ తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Tips To Make Perfect Crispy Dosa
Crispy Dosa Making Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 10:32 AM IST

Best Tips to Make Perfect Crispy Dosa: సౌత్ ఇండియన్ స్పెషల్ టిఫెన్​.. దోశ. దీనికి ఏ హోటల్​లో చూసినా గిరాకీ ఉంటుంది. ఇక దోశలలో ఎన్నో రకాలు ఉంటాయి. చాలా మంది హోటల్​కి వెళ్లి నచ్చిన దోశలను టేస్ట్ చేస్తుంటారు. కారణం.. అక్కడ సూపర్​ టేస్ట్​ అండ్​ క్రిస్పీగా ఉంటాయి. కానీ, అవే దోశలను(Dosa) ఇంటి వద్ద ప్రిపేర్ చేసుకుంటే మాత్రం అంత క్రిస్పీగా రావు. దీంతో ఇంట్లో చేయడమే మానేస్తుంటారు. అయితే అలాంటి వారి కోసం కొన్ని సింపుల్​ టిప్స్​ తీసుకొచ్చాం. పిండి తయారీ నుంచి దోశలు వేసుకునే వరకు వీటిని ఫాలో అయ్యారంటే చాలు.. దోశలు విరిగిపోకుండా క్రిస్పీగా, సూపర్ టేస్టీగా వస్తాయంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • మినపప్పు - అర కప్పు
  • బియ్యం - 2 కప్పులు
  • బొంబాయి రవ్వ - 1 టీస్పూన్
  • మెంతులు - అర టీస్పూన్

షుగర్ పేషెంట్లకు చక్కటి ఆహారం - "జొన్న దోశలు" ఇంట్లోనే చాలా ఈజీగా - రుచి అమోఘం!

దోశలు క్రిస్పీగా రావడానికి పాటించాల్సిన టిప్స్ :

పిండి తయారీ విధానం : దోశలు క్రిస్పీగా రావాలంటే ముందుగా పిండిని పర్ఫెక్ట్​గా తయారుచేసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం మినపప్పు, బియ్యం, మెంతులను ఒక బౌల్​లో తీసుకొని కనీసం 4 నుంచి 5 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్సీ జార్​లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఆ పిండిని రాత్రంతా బయటే ఉంచాలి. ఇలా ముందురోజు పిండిని రుబ్బి పక్కన పెట్టుకుంటే చక్కగా పులుస్తుంది. దోశలు క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి.

ఇవి కలుపుకోవాలి : బియ్యం, మినపప్పు, మెంతులను మెత్తగా గ్రైండ్​ చేసుకున్న తర్వాత ఆ పిండిలో బొంబాయి రవ్వ కూడా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ దోశలు క్రిస్పీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. బొంబాయి రవ్వ ప్లేస్​లో అన్నాన్ని మెత్తగా గ్రైండ్​ చేసుకుని పిండిలో కలుపుకున్నా కూడా క్రిస్పీగా వస్తుంటాయి.

రూమ్ టెంపరేచర్​లో ఉంచండి : చాలా మంది దోశల పిండిని ప్రిపేర్ చేసుకున్నాక రాత్రంతా ఫ్రిజ్​లో ఉంచుతారు. ఆపై నెక్ట్ డే వెంటనే ఆ పిండిని కొద్దిగా తీసుకొని దోశలు వేసుకుంటుంటారు. అలాకాకుండా ఫ్రిజ్​లో నుంచి పిండిని తీశాక కనీసం దాన్ని 20 నుంచి 25 నిమిషాలు రూమ్ టెంపరేచర్​లో ఉంచుకోవాలి. ఆ తర్వాత దోశ వేసుకుంటే చాలా చక్కగా వస్తుందంటున్నారు నిపుణులు.

దోశ వేసుకునే విధానం : పైన చెప్పిన విధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక ఇలా దోశ వేసుకోండి. ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టి బాగా హీట్ అవ్వనివ్వాలి. పాన్ బాగా వేడెక్కాక దానిపై ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ చల్లి సిలికాన్ బ్రష్​తో రుద్దాలి. అనంతరం కొద్దిగా పిండిని తీసుకొని పలుచగా దోశ వేసుకోవాలి. ఆపై ఓ వైపు కాస్తా కాలాక సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. క్రిస్పీ దోశ రెడీ!

కాల్చుకునేటప్పుడు జాగ్రత్తలు : దోశ వేసేటప్పుడు, వేయకముందు మంటను ఎక్కువగానే ఉండనివ్వాలి. దోశ వేశాక అది కాస్త దోరగా మారిందనుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్​కి తగ్గించాలనే విషయం గుర్తుంచుకోవాలి. ఆవిధంగా దోశ ఓ వైపు కాలాక మెల్లిగా కదిలిస్తూ తీసుకోవాలి. మీకు ఇష్టముంటే రెండోవైపు కాల్చుకోవాలి. లేదంటే.. అలానే తీసి సర్వ్ చేసుకోండి. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ టిప్స్ పాటిస్తూ ఇంట్లో ఓసారి దోశలను ట్రై చేయండి.

ఎగ్​ దోశ చేయడం ఇప్పుడు చాలా ఈజీ - ఈ టిప్స్ పాటించండి - టేస్ట్​ ఎంజాయ్​ చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.