How to Make Sweet Shop Style Karapusa : ఎక్కువ మంది ఇష్టంగా తినే పిండి వంటకాలలో ఒకటి.. కారపూస. అయితే, చాలా మంది దీన్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు గుల్లగా, రుచికరంగా రాలేదని ఫీల్ అవుతుంటారు. మరికొందరికైతే మెత్తగా లేదా గట్టిగా వస్తుంటాయని బాధపడుతుంటారు. అలాకాకుండా ఈ టిప్స్ పాటిస్తూ ఈ పండక్కి కారపూసను తయారు చేసుకోండి. గుల్లగా రావడమే కాదు.. టేస్ట్ స్వీట్ షాపుల్లో లభించే దానికి ఏమాత్రం తీసిపోదు! మరి, ఈ సూపర్ టేస్టీ కారపూసను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- శనగపిండి - 2 కప్పులు
- బియ్యప్పిండి - 3 టీస్పూన్లు
- వాముపొడి - అరటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - తగినంత
- పసుపు - పావు టీస్పూన్
- బటర్ - 2 టీస్పూన్లు
దసరా స్పెషల్ టేస్టీ కజ్జికాయలు - ఈ టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు!
తయారీ విధానం :
- ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండి, బియ్యప్పిండి, వాముపొడి, ఉప్పు, కారం, పసుపు వేసి ఒకసారి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో బటర్ కూడా వేసి మరోసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బటర్‌ను యాడ్ చేయడం ద్వారా కారపూసకు స్వీట్‌షాప్ స్టైల్ రుచి వస్తుంది.
- అనంతరం తగినన్ని వాటర్‌ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు సన్నని హోల్స్ ఉన్న కారపూస బిళ్లను జంతికల గొట్టానికి సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత జంతికల గొట్టం(గిద్దెలు) లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పిండి మురుకుల గొట్టానికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది.
- అనంతరం.. చేతికి కొద్దిగా ఆయిల్ అద్దుకొని ముందుగా కలిపిపెట్టుకున్న పిండి మిశ్రమంలో నుంచి కొద్దిగా పిండిని జంతికల గొట్టంలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడి అయ్యాక.. స్టౌను లో ఫ్లేమ్‌లో ఉంచి జంతికల గొట్టంలో ఉంచిన పిండిని కారపూసలా కాగుతున్న నూనెలో వత్తుకోవాలి.
- ఆ తర్వాత రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే "సన్నని కారపూస" రెడీ!
- ఒకవేళ.. మీకు డైరెక్ట్‌గా ఆయిల్లో వత్తుకోవడం ఇబ్బందిగా ఉంటే ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ లేదా గరిటె మీద కొద్దిగా నూనె రాసి పిండిని కారపూసలా వత్తుకొని దాన్ని కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి.
- పూర్తిగా చల్లారాక ఈ కారపూసను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 20 నుంచి 30 రోజులపాటు హ్యాపీగా తినేయొచ్చు!
షుగర్ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినొచ్చు! - దసరాకి "జొన్న మురుకులు" చేసుకోండిలా