ETV Bharat / offbeat

'బంధువుల ముందు అరాచకం చేస్తారు.. తల్లిని కొడుతుంటారు' - పిల్లల ప్రవర్తనను ఎలా మార్చాలి?

- పిల్లల్లో దుందుడుకు ప్రవర్తన కారణాలివే - అమ్మానాన్నలు ఇలా చేస్తే మంచిదట!

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Parenting Tips
Parenting Tips for Kids (ETV Bharat)

Parenting Tips for Kids : కొంతమంది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులతో బాగానే ఉంటారు. కానీ, బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు తల్లిని కొట్టడం, ఏదైనా కొనివ్వమని గట్టిగా అరిచి ఏడవడం, అవమానంగా మాట్లాడడం, అలగడం చేస్తుంటారు. దీంతో పేరెంట్స్​కి ఏం చేయాలో తోచదు. 'వీడు ఎప్పుడూ ఇలానే అల్లరి చేస్తాడు. ఇంకోసారి ఎక్కడికీ వెంట తీసుకురాకూడదు..' అని అందరి ముందు విసుక్కుంటారు. అలాగే స్కూల్లో తోటిపిల్లలతోనూ గొడవలు పడుతుంటారు. ఇలా.. ఇంట్లో ఉన్నప్పుడు సాధారణంగానే ఉంటూ, ఇతరుల ముందు మాత్రమే అల్లరి చేయడానికి కొన్ని కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

కాస్త ఇబ్బంది పడతారు..

చాలా మంది పిల్లలు కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు, చుట్టూ వాతావరణం అసౌకర్యంగా అనిపించినప్పుడు ఇబ్బంది పడతారు. అలాగే కొత్తవాళ్లు నచ్చకపోయినా ఒక విధంగా ప్రవర్తిస్తుంటారు. దీనివల్ల వారు ఎలాంటి కారణం లేకుండానే.. గట్టిగా అరుస్తూ తమ అసంతృప్తిని బయటపెట్టాలనుకుంటారు. అప్పటికీ పేరెంట్స్​ పట్టించుకోకపోతే తమకు తెలిసినవీ, ఎప్పుడైనా విన్నవీ లేదా ఇంట్లో అమ్మానాన్న ఒకరినొకరు నిందించుకునేటప్పుడు ఉపయోగించిన పదాలనూ ప్రయోగిస్తారు.

కొంతమంది పిల్లలైతే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పేరెంట్స్​ని విసిగిస్తుంటారు. వాళ్ల ఏకాగ్రతను తమవైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తారు. అయితే, ఇలా అల్లరి చేయడానికి కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలను తీవ్ర క్రమశిక్షణ విధానాలతో సరిదిద్దాలనుకోవడం ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. పిల్లలకు నచ్చినట్లుగా చేయనివ్వకపోయినా వారిలో దుందుడుకు ప్రవర్తన కనిపిస్తుందట. ఇలా పిల్లలు అల్లరి చేయడానికి రకరకాల కారణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి కూడా ఒక కారణమేనట!

ఏ తరగతిలో ఉన్న విద్యార్థులకైనా చదువులో రాణించడానికి కాస్త సమయం పడుతుంది. అలాగే కొత్త విషయాలను నేర్చుకునే సమయంలో పిల్లలు ఒత్తిడికి లోనవుతుంటారు. వారు అనుకున్న లక్ష్యాలను సరైన సమయానికి చేరుకోకపోతే మనసు నిరాశతో నిండిపోతుంది. ఇవన్నీ తీవ్ర ఒత్తిడిగా మారి వాళ్ల ప్రవర్తనపై ప్రభావం పడుతుంది.

నమ్మకాన్ని కలిగించాలి..

పిల్లలకెప్పుడూ పేరెంట్స్​ ఓ భరోసాగా నిలబడాలి. వారి చిన్నచిన్న సమస్యలకు పెద్దవాళ్ల వద్ద పరిష్కారం దొరుకుతుందనే నమ్మకాన్ని కలిగించాలి. అంతేగానీ.. వారు అల్లరి చేసినప్పుడు కొట్టకూడదు. ఏ కారణంతో వారు దూకుడుగా వ్యవహరిస్తున్నారో తెలుసుకుని మంచి చెడులు తెలియజేయాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు ఒకరినొకరు అవమానంగా మాట్లాడుకోకూడదు. ఎందుకంటే పేరెంట్స్​గా మనం గట్టిగా అరుస్తుంటే వారు కూడా అదే నేర్చుకుంటారు.

అలా చేయకూడదు..

చాలా మంది పేరెంట్స్​ తమ పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తుంటారు. కానీ, ఎప్పుడూ ఇలా చేయకూడదు. ప్రతి ఒక్కరిలోనూ ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహించాలి. అందుకే వారికి చదువుతో పాటు ఆటలు, పాటలు నేర్పించాలి. ఇలా చేస్తే వారు ఇష్టమైన రంగంలో ఆత్మవిశ్వాసంతో తప్పకుండా విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

ఇంటికి కొత్తవారు వస్తే, మీ పిల్లలు వారితో కలవలేకపోతున్నారా? - ఇది ఇంట్రావర్ట్ సమస్య కావొచ్చు, ఇలా సాల్వ్ చేయండి!

మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం లోపించిందా? - పేరెంట్స్​గా మీరు ఈ విషయాలు నేర్పించాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.