ETV Bharat / offbeat

ఆరోగ్యాన్నిచ్చే "కొత్తిమీర టమాటా పచ్చడి" - నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి! - రుచికి ఫిదా అవ్వాల్సిందే! - Kothimeera Tomato Pachadi Recipe

Tomato Kothimeera Pachadi Recipe : ఎప్పుడూ టమాటా పచ్చడిని ఒకే స్టైల్​లో తిని బోర్ కొట్టిందా? అయితే, ఈసారి వెరైటీగా కొత్తిమీరతో కలిపి ఇలా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ సూపర్​గా ఉంటుంది. మరి.. ఈ రుచికరమైన 'కొత్తిమీర టమాటా పచ్చడి' తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

Kothimeera Tomato Pachadi
Tomato Kothimeera Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 20, 2024, 4:29 PM IST

How to Make Tomato Kothimeera Pachadi : చాలా మంది ఇష్టపడే పచ్చళ్లలో టమాటా పచ్చడి ఒకటి. అయితే.. ఈ టమాటా పచ్చడిని మీరు ఇప్పటివరకు రకరకాలుగా ప్రయత్నించి ఉండవచ్చు. కానీ.. ఈసారి కాస్త వెరైటీగా ఇలా కొత్తిమీరతో కలిపి ప్రిపేర్ చేసుకోండి. రుచి అద్దిరిపోతుంది! పైగా ఈ పచ్చడిని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. ఈ విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంట్లో వాళ్లందరూ దీని టేస్ట్​కు ఫిదా అవ్వాల్సిందే! మరి.. ఈ టేస్టీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • టమాటాలు - అరకిలో
  • కొత్తిమీర - ఒక చిన్నకట్ట
  • ఆయిల్ - తగినంత
  • మినప పప్పు - 2 స్పూన్లు
  • పచ్చిమిర్చి - 12
  • పసుపు - చిటికెడు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర - అర టీస్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • చింతపండు - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే.. కొత్తిమీరను తరుక్కొని పెట్టుకోవాలి. అయితే.. కొత్తిమీరను మరీ చిన్నగా కాకుండా కాస్త పెద్ద సైజ్​లోనే తరుక్కోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. పొట్టు మినప పప్పు వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఆపై దాన్ని మిక్సీ జార్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో పచ్చిమిర్చిని మధ్యలోకి చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకొని మిక్సీ జార్​లోకి తీసుకోవాలి. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. మీరు తినే కారాన్ని బట్టి కావాల్సిన పరిమాణంలో పచ్చిమిర్చిని తీసుకోవాలి.
  • ఇప్పుడు అదే నూనెలో కొత్తిమీర తరుగు వేసి మంటను మీడియంలో ఫ్లేమ్​లో ఉంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ నూనె సరిపోకపోతే ఇంకాస్త యాడ్ చేసుకోవాలి.
  • కొత్తిమీర బాగా వేగిందనుకున్నాక దాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో.. టమాటా ముక్కలు వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ముక్కలు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
  • తర్వాత పాన్​పై మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి టమాటాలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు మధ్యమధ్యలో మూత తీసి గరిటెతో కలుపుతుండాలి.
  • ఇక టమాటా ముక్కలు బాగా మగ్గి సాఫ్ట్​గా మారాయనుకున్నాక.. స్టౌ ఆఫ్ చేసుకొని వాటిని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు.. ముందుగా వేయించుకొని మిక్సీ జార్​లోకి తీసుకున్న పచ్చిమిర్చి, మినప పప్పుతో పాటు ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చాలా తక్కువ పరిమాణంలో చింతపండు వేసుకొని పేస్ట్​లా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆ తర్వాత అందులోనే చల్లార్చుకున్న టమాటా ముక్కలు, వేయించి పక్కన పెట్టుకున్న కొత్తిమీర వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "కొత్తిమీర టమాటా పచ్చడి" రెడీ!
  • ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ పచ్చడికి తాలింపు పెట్టుకొని తినొచ్చు. లేదంటే ఇలానే అన్నం, టిఫెన్స్ దేనిలోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.

ఇవీ చదవండి :

వంకాయ, టమాటా, మెంతిపొడి - ఈ పచ్చడి తిన్నారంటే సామిరంగా అదుర్స్!

నోరూరించే "బీరకాయ టమాట పచ్చడి" - ఇలా ప్రిపేర్ చేస్తే రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.