ETV Bharat / offbeat

IRCTC సిల్వర్​ జూబ్లీ బంపర్​ ఆఫర్: విమాన టికెట్లపై సూపర్​ డిస్కౌంట్​ - బుకింగ్స్ రెండు రోజులే! - IRCTC Silver Jubilee Celebrations

author img

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

IRCTC: ఫ్లైట్ జర్నీ చేయాలనుకునే వారికి.. IRCTC గుడ్​న్యూస్​ చెబుతోంది. సిల్వర్​ జూబ్లీ సెలబ్రేషన్స్​లో భాగంగా.. విమాన టికెట్ల ధరపై తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

IRCTC
IRCTC Silver Jubilee Celebrations (ETV Bharat)

IRCTC Silver Jubilee Celebrations: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 27ను ఐఆర్‌సీటీసీ తన వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకొంటోంది. ఐఆర్‌సీటీసీ నెలకొల్పి ఈరోజుకి (సెప్టెంబర్​ 27) 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సెప్టెంబరు 26 నుంచి 28 వరకు ప్రత్యేక ఆఫర్‌ తీసుకొచ్చింది. తమ వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకొనే ఇండిగో విమాన టికెట్లపై 12 శాతం డిస్కౌంట్​ అందిస్తోన్నట్టు తెలిపింది. సిల్వర్​ జూబ్లీ సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్‌ తీసుకొచ్చినట్టు ఐఆర్‌సీటీసీ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పంచుకుంది. అయితే ఈ ఆఫర్‌ కేవలం మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుందని తెలిపింది.

బుకింగ్​ డేట్​: ఈ ప్రత్యేక ఆఫర్ కోసం బుకింగ్ వ్యవధి సెప్టెంబర్ 26 నుంచి సెప్టెంబర్ 28, 2024 వరకు ఉంటుందని తెలిపింది.

ప్రయాణం ఎప్పుడు చేయవచ్చంటే: ఈ ప్రత్యేక ఆఫర్ ప్రయాణ వ్యవధి అక్టోబర్ 3, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఉంటుంది. అంటే అక్టోబర్​ 3 నుంచి 2025 మార్చి 31 వరకు ఇండిగో విమానాల్లో ప్రయాణించవచ్చు. ఇందుకోసం పైన చెప్పిన తేదీల్లో టికెట్​ బుక్​ చేసుకోవాలి.

ఎలా బుక్​ చేసుకోవాలి: ఐఆర్​సీటీసీ అందిస్తున్న ఈ ఆఫర్​ ద్వారా ఫ్లైట్​ టికెట్లు బుక్​ చేసుకోవాలనుకుంటున్న వారు ఐఆర్​సీటీసీ అధికారిక వెబ్​సైట్​ లేదా మొబైల్​ యాప్​ ద్వారా బుకింగ్​ చేసుకోవచ్చు.

ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​ ద్వారా ఎలా బుక్​ చేసుకోవాలంటే:

  • ముందుగా ఐఆర్​సీటీసీ ఎయిర్​ వెబ్​సైట్​ ఓపెన్​ చెయ్యాలి.
  • ఆ తర్వాత Flights ఆప్షన్​పై క్లిక్​ చేసి లాగిన్​ అవ్వాలి. ఒకవేళ మీకు లాగిన్​ వివరాలు లేకపోతే రిజిస్ట్రేషన్​ చేసుకుని ఆ తర్వాత లాగిన్​ అవ్వాలి.
  • ఆ తర్వాత మీరు ఎక్కడికి , ఎప్పుడు, ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారో ఆ వివరాలు ఎంటర్​ చేయాలి. అన్ని వివరాలూ ఫిల్​ చేసిన తర్వాత టికెట్​కు అమౌంట్​ పే చేయాలి.
  • అక్టోబర్​ 3, 2024 నుంచి మార్చి 31, 2025 మధ్య తేదీల్లో ప్రయాణానికి మాత్రమే టికెట్​ బుక్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీ టికెట్​ కన్ఫ్మామ్​ అయినట్లు మెసేజ్​ వస్తుంది.

ఐఆర్​సీటీసీ మొబైల్​ యాప్​​ ద్వారా ఎలా బుక్​ చేసుకోవాలంటే:

  • ముందుగా ఫోన్లో IRCTC Air యాప్​ డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • మీ IRCTC వివరాలతో లాగిన్​ అవ్వాలి.
  • ఆ తర్వాత Book Flight ఆప్షన్​పై క్లిక్​ చేసి.. మీరు ఎక్కడికి , ఎప్పుడు, ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారో ఆ వివరాలు ఎంటర్​ చేయాలి. అన్ని వివరాలు ఫిల్​ చేసిన తర్వాత టికెట్​కు అమౌంట్​ పే చేయాలి.
  • అక్టోబర్​ 3, 2024 నుంచి మార్చి 31, 2025 మధ్య జర్నీకి మాత్రమే టికెట్​ బుక్​ చేసుకోవాలి.

తత్కాల్ టికెట్ బుక్ అవ్వడం లేదా? - ఇలా చేశారంటే మీ టికెట్ ఈజీగా కన్ఫర్మ్ అవుతుంది!

IRCTC రిఫండ్స్‌ ఇక మరింత స్పీడ్​గా- గంటలోనే మీ అకౌంట్లోకి డబ్బులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.