Egg Pulusu Cooking Tips in Telugu : చాలా మంది ఎగ్ పులుసును ఇష్టంగా తింటుంటారు. అయితే.. చాలా మంది పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయడం రాదు. ప్రతిసారీ పులుపు ఎక్కువ, తక్కువ కావడమో.. కారం సరిపోకపోవడమో జరుగుతుంటాయి. ఈ సమస్యలేవీ లేకుండా పర్ఫెక్ట్గా ఎగ్ పులుసు చేయాలంటే ఈ టిప్స్ పాటించాలని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి? కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
ఎగ్ పులుసు చేసేటప్పుడు పాటించాల్సిన టిప్స్ :
- కోడిగుడ్లను ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎందుకంటే ఇలా ఉడికించడం వల్ల ఎగ్ వైట్ రబ్బర్లాగా మారుతుంది. కాబట్టి అవి హాఫ్ బాయిల్ వరకు ఉడికించుకుంటే సరిపోతుందని అంటున్నారు. ఎందుకంటే పులుసులో ఇవి మళ్లీ ఉడుకుతాయి కాబట్టి సెట్ అయిపోతుంది.
- ఇక కూరకు రుచిని అందించేవి మసాలాలు. చాలా మంది బయట మార్కెట్లో లభించే మసాలాను ఇందులో ఉపయోగిస్తుంటారు. కానీ ఇంట్లో చేసుకునే మసాలాలు బెస్ట్ అంటున్నారు నిపుణులు.
- ఉల్లిపాయలు, ఇతర పదార్థాలను వేయించుకోవడం కూడా ఇంపార్టెంట్ అంటున్నారు. తొందరగా ఫ్రై కావాలని హై ఫ్లేమ్‌లో ఉడికిస్తే.. సరిగ్గా ఉడకక కూర రుచి పోతుందంటున్నారు. కాబట్టి సిమ్‌లో పెట్టి నిధానంగా ఫ్రై చేసుకోవడం మంచిదంటున్నారు.
- కొద్దిమందికి ఎంత మంచిగా చేసినా కొన్నిసార్లు పులుసు పల్చగా మారిపోతుంది. అలాంటి సమయంలో కొద్దిగా క్రీమ్ యాడ్ చేస్తే కూర దగ్గరకు రావడంతోపాటు రుచి కూడా అద్దిరిపోతుంది.
- ఇక చివరగా చాలా మంది స్టవ్ ఆఫ్ చేయగానే రైస్ పెట్టుకుని తింటుంటారు. కానీ.. అలా కాకుండా కూర ప్రిపేర్ అయిన తర్వాత కొద్దిసేపు దాన్ని పక్కకు పెట్టి ఆ తర్వాత తింటే మంచి టేస్ట్ వస్తుందని అంటున్నారు.
ఈ స్నాక్స్ వెరీ 'గుడ్డు' - ఇలా చేస్తే "సూపర్ మమ్మీ" అంటూ లొట్టలేసుకుంటూ తింటారు!
ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
- ఉడికించిన గుడ్లు - 4
- పసుపు - సరిపడా
- నూనె - సరిపడా
- కరివేపాకు రెబ్బలు - 2
- పచ్చిమిర్చి - 4
- ఉల్లిపాయ - 1(పెద్దది)
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- టమాట - 2
- మెంతులు - పావు టీ స్పూన్
- చింతపండు గుజ్జు - పావు కప్పు
- కారం - టేబుల్ స్పూన్
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
- గరం మసాలా - అర టీ స్పూన్
- నీరు - 300ml
- కొత్తిమీర తరుగు - అరకప్పు
తయారీ విధానం:
- ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి టీ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసి ఉడికించిన కోడిగుడ్లు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పడు మరో కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి అరకప్పు నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ తరుగు వేసి.. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఉప్పు, అర చెంచా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి.
- ఇప్పుడు టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. నూనె పైకి తేలుతున్నప్పుడు మెంతులు, చింతపండు గుజ్జు వేసి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంతవరకు వేయించుకోవాలి.
- తర్వాత కారం, ధనియాల పొడి, గరం మాసాలా వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
- అనంతరం నీరు పోసి కలిపి లో ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి.
- ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్‌కు కొద్దిగా గాట్లు పెట్టి పులుసులో వేసుకోవాలి.
- ఆ తర్వాత కొత్తిమీర తరుగు వేసి 5 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి కుక్ చేసుకుని దింపేసుకుంటే సరి.. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు రెడీ..
ఎగ్ దోశ చేయడం ఇప్పుడు చాలా ఈజీ - ఈ టిప్స్ పాటించండి - టేస్ట్ ఎంజాయ్ చేయండి!
బేకరీలో దొరికే ఎగ్ పఫ్స్ ఇంట్లోనే - అది కూడా ఓవెన్ లేకుండానే! - ఇలా ప్రిపేర్ చేసుకోండి
సండే స్పెషల్ : కుక్కర్లో 10 నిమిషాల్లోనే ఎగ్ బిర్యానీ! - యమ్మీ యమ్మీగా ఉంటుంది!