ETV Bharat / offbeat

దీపావళి స్పెషల్ స్వీట్ "సజ్జప్ప" - ఒకసారి చేస్తే 2 నెలలు ఉంటుంది - పైగా టేస్ట్​ అద్భుతం!

-పండగ వేళ కర్ణాటక స్పెషల్ స్వీట్ -రొటీన్ స్వీట్ కాకుండా వెరైటీగా చేసుకోండిలా!

Sajjappa Recipe in Telugu
Sajjappa Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 25, 2024, 4:55 PM IST

Sajjappa Recipe in Telugu: దీపావళి పండగ నేపథ్యంలో చాలా రకాల స్వీట్లను చేసుకుంటుంటారు. కానీ మనకు తెలిసిన రొటీన్ స్వీట్లను ఏం తింటాం చెప్పండి. అందుకే వెరైటీగా కర్ణాటక స్పెషల్ స్వీట్ సజ్జప్పను ట్రై చేయండి. దీనిని కర్ణాటకలో దీపావళి సమయంలో తప్పనిసరిగా చేసుకుంటుంటారు. ఈ స్వీట్ చాలా టేస్టీగా, కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. ఇంకా దీనిని డబ్బాలో పెట్టుకుంటే సుమారు రెండు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • ఒక కప్పు చిరోటి రవ్వ
  • 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి
  • చిటికెడు ఉప్పు
  • ఒక కప్పు బెల్లం
  • ఒక కప్పు కొబ్బరి పొడి
  • అర కప్పు గసగసాలు
  • అర టీ స్పూన్ యాలకుల పొడి
  • ఫ్రైకి సరిపడా నూనె

తయారీ విధానం

  • ముందుగా ఓ గిన్నెలో చిరోటి రవ్వ, మైదా పిండి, ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పూరీ పిండిలా కలిపి మూతపెట్టి రెండు గంటల పాటు పక్కకుపెట్టుకోవాలి.
  • ఆ తర్వాత మూత తీసి 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి మరోసారి బాగా కలపాలి.
  • ఇప్పుడు స్టఫ్ కోసం స్టౌ ఆన్ చేసుకుని ఓ గిన్నెలో బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.
  • బెల్లం కరిగిన తర్వాత ఇందులోనే కొబ్బరి పొడి, గసగసాలు, యాలకుల పొడి వేసుకుని పచ్చివాసన పోయేవరకు కలపాలి. (స్టఫ్ గట్టిపడేవరకు మీడియం ఫ్లేమ్​లోనే ఉంచాలి.)
  • స్టఫ్ గట్టిపడిన తర్వాత వీటిని లడ్డూలాగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని తీసుకుని పూరీలాగా చేసుకుని దానిలో స్టఫ్ మిశ్రమాన్ని పెట్టుకుని అంచులు మూసివేయాలి.
  • ఆ తర్వాత బొబ్బట్లు చేసినట్లుగా మిశ్రమం బయటకు రాకుండా చపాతీలాగా చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె వేడయ్యాక ఇందులో రెడీ చేసి పెట్టుకున్న సజ్జప్పను వేసి రెండు వైపులా రంగు మారేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతే కరకరలాడే కర్ణాటక స్పెషల్ స్వీట్ అద్దిరిపోతుంది. మీరు ఈ దీపావళికి ఓ సారి ట్రై చేయండి.

దీపావళి స్పెషల్ : నోట్లో వేసుకుంటే కరిగిపోయే "పెసరపప్పు హల్వా" - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

ఉసిరికాయతో జ్యూసీ స్వీట్ చేసుకోండి- ఏడాది పాటు హాయిగా తినండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.