ETV Bharat / offbeat

10 నిమిషాల్లోనే కమ్మటి "వెజిటబుల్ మసాలా రైస్ "​ - పిల్లలకు ఇష్టమైన రెసిపీ - VEGETABLE MASALA RICE IN TELUGU

- లంచ్​ బాక్స్​లోకి చక్కటి ఆప్షన్ ​- అమ్మలకు బోలెడు టైమ్ సేవ్!

How to Make Vegetable Masala Rice
How to Make Vegetable Masala Rice (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2024, 10:27 AM IST

How to Make Vegetable Masala Rice : పిల్లలకు ప్రతిరోజూ రుచికరమైన, పోషకాలతో కూడిన ఆహారాలు తయారు చేయడానికి అమ్మలు వంటింట్లో కుస్తీ పడుతుంటారు. ఇక, ఉద్యోగం చేసే మహిళలకైతో మరింత సవాల్. పిల్లల స్కూల్​కి టైమ్​ అవుతుందని ఓ పక్కన.. మరో పక్క ఆఫీస్​కి వెళ్లాలనే టెన్షన్​ ఉంటుంది.

అందుకే.. తక్కువ సమయంలో, పోషకాలు అందేలా ఓ మంచి లంచ్​ బాక్స్​ రెసిపీ తీసుకొచ్చాం. అదే టేస్టీ 'వెజిటబుల్ మసాలా రైస్'. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే కమ్మటి మసాలా రైస్​ తయారైపోతుంది. ఇది చేయడానికి ఇంట్లో ఉండే పదార్థాలు సరిపోతాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా వెజిటబుల్​ మసాలా రైస్​ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • అన్నం- పెద్ద కప్పు
  • క్యారెట్​-1
  • ఉల్లిపాయ-1
  • టమాటా-1
  • పచ్చిమిర్చి-2
  • పచ్చి బఠానీలు-అరకప్పు
  • ఉప్పు రుచికి సరిపడా
  • నూనె -2 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు-అరటీస్పూన్​
  • శనగపప్పు-టీస్పూన్​
  • మినప్పప్పు-టీస్పూన్​
  • కరివేపాకు-2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్-అరటీస్పూన్​
  • కారం-టీస్పూన్​
  • గరం మసాలా- అరటీస్పూన్​
  • పసుపు-చిటికెడు
  • కొత్తిమీర తరుగు కొద్దిగా

తయారీ విధానం..

  • ముందుగా రెసిపీ కోసం టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్​ సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • అలాగే పచ్చి బఠానీలను ఉడికించి ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు మసాలా రైస్​ చేయడం కోసం.. స్టౌ పై కడాయి పెట్టండి. ఇందులో ఆయిల్​ పోయండి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • తాలింపు దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
  • ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత క్యారెట్​ ముక్కలు, ఉడికించిన బఠానీలు వేసి ఫ్రై చేయండి. ఆపై కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి.
  • కూరగాయలు కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు టమాటా ముక్కలు, కాస్త ఉప్పు వేసి వేయించండి.
  • టమాటా ముక్కలు మెత్తగా అయిన తర్వాత కారం, గరం మసాలా, పసుపు వేసి కలపండి.
  • ఇప్పుడు పొడిపొడిగా వండుకున్న అన్నం ఇందులో వేసి బాగా మిక్స్​ చేయండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత కాస్త కొత్తిమీర తరుగు చల్లి స్టౌ ఆఫ్​ చేస్తే సరిపోతుంది.
  • ఎంతో రుచికరమైన టేస్టీ అండ్​ హెల్దీ వెజిటబుల్ మసాలా రైస్​ మీ ముందుంటుంది.
  • ఈ రెసిపీ నచ్చితే ఓ సారి తప్పక ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

కేవలం 10 నిమిషాల్లోనే రుచికరమైన "పల్లీల రైస్"​ - పిల్లల లంచ్ బాక్స్​లోకి పర్ఫెక్ట్​ రెసిపీ!

లంచ్​ బాక్స్ స్పెషల్​ కమ్మటి "ఉసిరికాయ అన్నం" - 10 నిమిషాల్లోనే సిద్ధం చేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.