ETV Bharat / offbeat

హోటల్ స్టైల్​ "కారం పొడులు" - కూరలు బోర్​ కొడితే ఇవి ట్రైచేయండి - నెయ్యితో కలిపి తింటే అమృతమే!

-నిమిషాల్లో ప్రిపేర్​ అయ్యే టేస్టీ కారప్పొడులు -పిల్లలు సైతం ఇష్టంగా తినేస్తారు!

How to Make variety Karam Podi
How to Make variety Karam Podi in Telegu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 1:32 PM IST

How to Make variety Karam Podi in Telegu: కంచంలో విందు భోజనం ఉన్నా .. కారప్పొడులను చూస్తే అలా ప్రాణం లేచివస్తుంది చాలా మందికి! వేడివేడి అన్నంలో కాస్త కారం పొడి వేసుకుని, మరికాస్త నెయ్యి వేసుకుని తింటుంటే ఆ ఫీలింగ్​ వేరే లెవల్​. అయితే.. కారప్పొడి ప్రిపేర్ చేయడం ఒక ఆర్ట్. హోటల్స్​లో తయారు చేసే కారప్పొడి అద్దిరిపోతుంది. దాన్ని ఇంట్లో తయారు చేయాలని చూస్తే.. చాలా మందికి సాధ్యం కాదు! కారణం ఏమంటే.. అందులో పాటించే కొన్ని టిప్స్. అవేంటో మీరూ తెలుసుకోండి.

1. కొబ్బరి కారం:

  • ఎండుకొబ్బరి చిప్పలు - రెండు
  • ఎండుమిర్చి - పావుకిలో
  • వెల్లుల్లి రెబ్బలు - ఆరు
  • శనగపప్పు - 3 టేబుల్‌స్పూన్లు
  • మినప్పప్పు - టీ స్పూను
  • నూనె - అర టీస్పూను
  • జీలకర్ర - 3 టేబుల్‌స్పూన్లు
  • ఉప్పు - తగినంత
  • కరివేపాకు - పది రెబ్బలు

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి బాణలి పెట్టి అందులో నూనె వేసి ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు వేసి వేయించి తీయాలి.
  • ఆ తరవాత అదే బాండీలో ఎండు కొబ్బరిముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు కూడా వేసి వేయించి చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్​ చేసి స్టోర్​ చేసుకుంటే చాలు.

2. పల్లీల పొడి:

కావలసినవి

  • పల్లీలు - కప్పు
  • ఎండుమిర్చి - 12
  • వెల్లుల్లి రెబ్బలు- ఆరు
  • జీలకర్ర- 2 టీస్పూన్లు
  • ఎండు కొబ్బరి పొడి- 2 టేబుల్‌స్పూన్లు
  • ఉప్పు- రుచికి సరిపడా
  • నూనె- టీస్పూను

తయారుచేసే విధానం:

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి పల్లీలు వేయించి, చల్లారాక పొట్టు తీసి పక్కన ఉంచాలి.
  • ఇప్పుడు అదే పాన్‌లో నూనె వేసి ఎండుమిర్చి వేసి ఓ నిమిషం వేగాక జీలకర్ర వేసి ఓ నిమిషం వేయించి దించాలి.
  • చల్లారాక మిక్సీలో వేయించిన ఎండు మిర్చి మిశ్రమం, కొబ్బరిపొడి వేసి మెత్తగా చేయాలి.
  • తరవాత వెల్లుల్లి, వేయించిన పల్లీలు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కచ్చాపచ్చాగా పొడి చేసి తీయాలి.

3. పుదీనా కారం పొడి

కావలసినవి

  • పుదీనా - రెండు కట్టలు (పెద్దవి)
  • నూనె - టీస్పూను
  • మినప్పప్పు - 3 టేబుల్‌స్పూన్లు
  • శనగపప్పు - పావుకప్పు
  • ఎండుమిర్చి - నాలుగు
  • ఇంగువ - చిటికెడు
  • చింతపండు - కొద్దిగా
  • మిరియాలు - అరటీస్పూను
  • జీలకర్ర - టీస్పూను
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారుచేసే విధానం

  • ముందుగా పుదీనా ఆకులను కాడలతో సహా శుభ్రంగా కడిగి చిన్నగా కట్​ చేసుకుని రాత్రంతా ఫ్యాన్​ గాలికి ఆరనివ్వాలి.
  • ఆ మరుసటి రోజు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి అందులో పుదీనా వేసి దోరగా వేయించి పక్కకు పెట్టాలి.
  • ఆ తర్వాత అదే బాండీలో నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, చింతపండు వేసి వేయించాలి. తరవాత జీలకర్ర, మిరియాలు కూడా వేసి వేగనివ్వాలి.
  • ఇప్పుడు చల్లారిన తరవాత అన్నీ కలిపి మిక్సీలో వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి పొడి చేసుకోవాలి.

వేడివేడి అన్నంలోకి నల్ల కారం పొడి - కాస్త నెయ్యి తగిలిస్తే ఆహా అనాల్సిందే! - ఇలా ప్రిపేర్ చేయండి

వేడి వేడి అన్నంలో పుదీనా తొక్కు పచ్చడి - ఈ రుచి చూడాలంటే అదృష్టం ఉండాలి - ఇలా ప్రిపేర్ చేసుకోండి!

టిఫిన్ సెంటర్ రుచిలో​ 'టమాట పుదీనా' చట్నీ - ఇలా చేస్తే నిమిషాల్లో రెడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.